- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తొమ్మిదేళ్లు లివింగ్‌లో ఉండి పెళ్లికి నిరాకరణ.. కేసు పెట్టిన యువతికే షాక్ ఇచ్చిన కోర్టు
లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఉండి పెళ్లికి నిరాకరించాడని కోర్టును ఆశ్రయించిన యువతికి న్యాయస్థానం ఊహించని షాక్ ఇచ్చింది. యువకుడిపై పెట్టిన కేసును కోర్టు కొట్టివేసింది. వివరాల్లోకి వెళితే... తమిళనాడులోని తిరునెల్వేలికి చెందిన దేవా విజయ్ పై ఓ యువతి వళ్లియూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

దిశ, వెబ్ డెస్క్: లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఉండి పెళ్లికి నిరాకరించాడని కోర్టును ఆశ్రయించిన యువతికి న్యాయస్థానం ఊహించని షాక్ ఇచ్చింది. యువకుడిపై పెట్టిన కేసును కోర్టు కొట్టివేసింది. వివరాల్లోకి వెళితే... తమిళనాడులోని తిరునెల్వేలికి చెందిన దేవా విజయ్ పై ఓ యువతి వళ్లియూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. విజయ్ తనతో తొమ్మిదేళ్లు లైగింక సంబంధంలో పెళ్లి చేసుకోమంటే నిరాకరిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది.
కొన్నేళ్లుగా తాము ప్రేమలో ఉన్నామని విజయ్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరక సంబంధం కొనసాగించాడని తెలిపింది. విజయ్‌తో తన పెళ్లి చేయాలని కోరింది. కాగా ఈ పిటిషన్ పై మద్రాస్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. వివాహానికి ముందు శారీరక సంబంధం సర్వసాధారణమైందని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఇది ప్రేమ బంధమో, ఆనందమో వారికే తెలుసని వ్యాఖ్యానించింది. సమాజంలో జరుగుతున్న వాస్తవాలను కోర్టులు విస్మరించలేవని వెల్లడించింది. యువకుడిపై నమోదైన కేసును కొట్టివేసింది.






