- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లగ్జరీ కార్ల దిగుమతి వ్యవహారం.. నటుడు దుల్కర్ సల్మాన్ ఇంట్లో కస్టమ్స్ తనిఖీలు
‘ఆపరేషన్ నుముఖోర్’ (Operation Numukhor)లో భాగంగా మాలీవుడ్ ప్రముఖ నటులు దుల్కర్ సల్మాన్ (Dulquer Salman), పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ఇళ్లపై కస్టమ్స్ అధికారులు ఇవాళ ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ‘ఆపరేషన్ నుముఖోర్’ (Operation Numukhor)లో భాగంగా మాలీవుడ్ ప్రముఖ నటులు దుల్కర్ సల్మాన్ (Dulquer Salman), పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ఇళ్లపై కస్టమ్స్ అధికారులు ఇవాళ ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. భూటాన్ (Bhutan) నుంచి లగ్జరీ కార్లు అక్రమంగా దిగుమతి చేసుకున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు కొనసాగుతున్నాయి. ఏకకాలంలో కొచ్చి (Kochi)తో మొత్తం 30 చోట్ల వేర్వేరు ప్రాంతాల్లో అధికారుల సోదాలు ముమ్మరంగా చేస్తున్నారు. భూటాన్ నుంచి దాదాపు 100 అత్యంత లగ్జరీ కార్లను కస్టమ్స్ అధికారుల కళ్లుగప్పి దేశంలోకి తీసుకొచ్చినట్లుగా విచారణలో వెల్లడైంది. దీంతో తాజాగా కస్టమ్స్ అధికారులు చేపడుతోన్న తనిఖీలకు అత్యంత ప్రధాన్యత సంతరించుకుంది.
Next Story






