Lutnick: వచ్చే ఏడాది నుంచి హెచ్-1బీ ఫీజులు.. అమెరికా వాణిజ్య కార్యదర్శి లుట్నిక్

by B.Srinivas |

వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి హెచ్-1బీ వీసా ఫీజు నిర్ణయం అమల్లోకి వస్తుందని అమెరికా వాణిజ్య కార్యదర్శి లుట్నిక్ తెలిపారు.

Lutnick: వచ్చే ఏడాది నుంచి హెచ్-1బీ ఫీజులు.. అమెరికా వాణిజ్య కార్యదర్శి లుట్నిక్
X

దిశ, నేషనల్ బ్యూరో: వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి హెచ్-1బీ వీసా ఫీజు నిర్ణయం అమల్లోకి వస్తుందని, ఇది వచ్చే ముందే వీసా ప్రక్రియలోనూ భారీ మార్పులు ఉంటాయని అమెరికా వాణిజ్య కార్యదర్శి హొవార్డ్ లుట్నిక్ (Howard lutnick) తెలిపారు. తాజాగా ఆయన ఓ మీడిచా చానల్‌తో మాట్లాడారు. ప్రస్తుత హెచ్-1B వీసా ప్రక్రియ లోపభూయిష్టంగా ఉందని అభివర్ణించారు. దీని వల్ల తక్కువ ఖర్చుతో కూడిన టెక్ కన్సల్టెంట్ల ప్రవేశానికి వీలు కలుగుతుందని తెలిపారు. అంతేగాక వారు తమ కుటుంబాలను సైతం అమెరికాకు తీసుకువస్తారన్నారు. ఇది పూర్తిగా తప్పుడు ఆలోచన అని చెప్పారు. భవిష్యత్‌లో ఈ వీసా సిస్టమ్‌లో మార్పులను చూస్తామని తెలిపారు. దీనిపై 2026 ఫిబ్రవరి నాటికి స్పష్టత వస్తుందన్నారు. ఆలోచనాత్మక మార్పును చూడబోతున్నారని భావిస్తున్నట్టు వెల్లడించారు. తక్కువ ఖర్చుతో కూడిన టెక్ కన్సల్టెంట్ల కంటే అధిక నైపుణ్యం కలిగిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఫ్యూచర్ రీఫామ్స్ విద్య, వైద్యం వంటి రంగాల్లోని నిపుణులకు ప్రాధాన్యత ఇస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, హెచ్-1బీ వీసాను ట్రంప్ భారీగా పెంచిన విషయం తెలిసిందే.

Next Story