విస్తృత చర్చల తర్వాత ఆమోదిస్తేనే చట్టాలకు సంపూర్ణత.. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా

by Dishafeatures2 |
విస్తృత చర్చల తర్వాత ఆమోదిస్తేనే చట్టాలకు సంపూర్ణత.. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా
X

పనాజీ (గోవా) : పార్లమెంటు, అసెంబ్లీలలో సుదీర్ఘమైన, లోతైన చర్చలు జరిగితేనే అత్యుత్తమ చట్టాల రూపకల్పన సాధ్యమవుతుందని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. చట్టసభలలో జరిగే చర్చలు రాజకీయాలకు అతీతంగా, నిష్పక్షపాతంగా ఉండాలని సూచించారు. గురువారం గోవా అసెంబ్లీలో నిర్వహించిన 'వికసిత్ భారత్ 2047' కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. విస్తృతమైన, సరైన చర్చల తర్వాత చట్టాలను ఆమోదిస్తేనే అవి సంపూర్ణంగా ఉంటాయని ఓం బిర్లా పేర్కొన్నారు.

40 రోజులకుపైగా సుదీర్ఘ సమావేశాలను నిర్వహించారంటూ గోవా అసెంబ్లీని ఆయన ప్రశంసించారు. చాలా రాష్ట్రాల్లో అసెంబ్లీ సమావేశాలు తక్కువ రోజులే జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వంపై అనర్హత వేటు విధించినందుకుగానూ ఈ కార్యక్రమాన్ని గోవా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బహిష్కరించారు.

Next Story

Most Viewed