LokSabhaElections2024: లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్

by Disha Web Desk 19 |
LokSabhaElections2024: లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ శనివారం విడుదల చేశారు. దేశ వ్యాప్తంగా మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 19న తొలి దశ, ఏప్రిల్ 26న రెండో దశ, మే 7న మూడో దశ, మే 13న నాలుగవ దశ, మే 20న ఐదో దశ, మే 25న ఆరో దశ, జూన్ 1న ఏడో దశ పోలింగ్ జరగనుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. మే 13న జరిగే నాలుగవ దశలో రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ జరగనుంది. జూన్ 4వ తేదీన ఏపీ, తెలంగాణలో కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది.

Next Story