Election Results LIVE: థియేటర్లలో ఎన్నికల ఫలితాల ప్రత్యక్ష ప్రసారం! టికెట్ ధర రూ. 99 మాత్రమేనట..

by Ramesh Naini |   (  Updated:2024-05-31 12:31:53  IST  )

సార్వత్రిక ఎన్నికల ప్రచార ఘట్టానికి తెరపడిన విషయం తెలిసిందే. నెల రోజులకు పైగా విడతల వారీగా ఈ ఎన్నికలు జరుగుతున్నాయి.

Election Results LIVE: థియేటర్లలో ఎన్నికల ఫలితాల ప్రత్యక్ష ప్రసారం! టికెట్ ధర రూ. 99 మాత్రమేనట..
X

దిశ, డైనమిక్ బ్యూరో: సార్వత్రిక ఎన్నికల ప్రచార ఘట్టానికి తెరపడిన విషయం తెలిసిందే. నెల రోజులకు పైగా విడతల వారీగా ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. రేపు (జూన్ 1) ఏడో విడత చివరి ఎన్నికలు 8 రాష్ట్రాల్లో జరగనున్నాయి. అనంతరం జూన్ 4 వ తేదీన ఓట్ల లెక్కింపు ఫలితాల ప్రకటన ఉంటుంది. ఈ క్రమంలోనే దేశ ప్రజల అందరి దృష్టి ఫలితాలపైనే ఉంది. జూన్ 4న, వివిధ మీడియా ఛానెల్‌లలో పూర్తి కవరేజీ ప్రజలకు అందుబాటులో ఉంటుంది. కానీ ఇప్పుడు, మీకు సమీపంలోని థియేటర్‌లలోని పెద్ద స్క్రీన్‌లపై కూడా కవరేజీని చూడవచ్చు.

ఈ క్రమంలోనే మూవీ మ్యాక్స్ ప్రజలకు తీపి కబురు అందించింది. మహారాష్ట్రలోని ముంబైతో పాటు పలు నగరాల్లో థియేటర్లు ఎన్నికల ఫలితాలను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. మూవీ మ్యాక్స్ ఆధ్వర్యంలోని అన్ని థియేటర్లలో ఓట్ల లెక్కింపు లైవ్ సహా బ్రేకింగ్ న్యూస్‌లను ప్రదర్శించనున్నారు. జూన్ 4న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ ప్రసారాలు ఉంటాయని, టికెట్ ధర రూ. 99 నుంచి రూ. 300 వరకు నిర్ణయించినట్లు సమాచారం.

Next Story