'ఫైనాన్స్ బిల్లు'కు.. లోక్ సభ ఆమోదం

by Geesa Chandu |   (  Updated:2024-08-07 14:13:36  IST  )

2024 ఫైనాన్స్ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును 45 సవరణలతో ఆమోదం తెలిపింది దిగువ సభ.

ఫైనాన్స్ బిల్లుకు.. లోక్ సభ ఆమోదం
X

దిశ, వెబ్ డెస్క్: 2024 ఫైనాన్స్ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును 45 సవరణలతో ఆమోదం తెలిపింది దిగువ సభ. కేంద్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ పై తాజాగా ప్రవేశపెట్టిన కొత్త మూలధన లాభాల పన్నును సడలించిన తర్వాత.. లోక్ సభ బుధవారం 2024 ఆర్ధిక బిల్లు(ఫైనాన్స్) ను ఆమోదించింది. పన్ను చెల్లింపుదారులు.. కొత్త తక్కువ పన్ను రేటుకు మారటానికి లేదా అధిక రేటు ఉన్న పాత పాలనలో ఉండటానికి అవకాశం కల్పించింది.కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 బడ్జెట్ ప్రసంగంలో రియల్ ఎస్టేట్ పై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నును ఇండెక్సేషన్ తో కూడిన 20 శాతం నుండి 12.5 శాతానికి తగ్గించాలని ప్రతిపాదించారు. దీంట్లో 20 శాతం లేదా 12.5 శాతం పన్నును ఎంచుకునే అవకాశాన్ని కల్పించారు.

రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి ఎల్టీసీజీ (LTCG) లో రెండు ఐచ్చికాలను ఎంచుకునే అవకాశాన్ని కల్పించింది. పన్ను చెల్లింపు దారులు ఇండెక్సేషన్ లేకుండా కొత్త 12.5% రేటు లేదా జూలై 23 కంటే ముందు కొనుగోలు చేసిన ఆస్తులకు, ఇండెక్సేషన్ తో పాత 20% రేటు మధ్య ఎంచుకోవడానికి అనుమతించే సవరణను ప్రవేశ పెట్టారు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్.

Next Story