ఎగ్జామ్ లో కాపీ కొడితే ఇక జీవిత ఖైదు.. సంచలన నిర్ణయం తీసుకున్న సీఎం

by Dishafeatures2 |
ఎగ్జామ్ లో కాపీ కొడితే ఇక జీవిత ఖైదు.. సంచలన నిర్ణయం తీసుకున్న సీఎం
X

దిశ, వెబ్ డెస్క్: ఎగ్జామ్స్ లో కాపీ కొడితే డిబార్, రస్టిగేట్ వంటివి చేస్తారు. కానీ ఉద్యోగ పరీక్షల్లో జరుగుతున్న అవకతవకలను అరికట్టడానికి ఉత్తరాఖండ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కాంపిటేటివ్ పరీక్షలో కాపీ కొడితే జీవిత ఖైదు లేదా కనీసం 10 ఏళ్ల జైలు శిక్ష తప్పదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ ధామి ఆదివారం ప్రకటించారు. ఆదివారం కల్సిలో జరిగిన ఓ కల్చరల్ ఫెస్టివల్ లో పాల్గొన్న సీఎం పుష్కర్ ధామి మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్వహంచే ఉద్యోగ పరీక్షల్లో కాపీ కొడితే సహించేది లేదన్నారు. ఎన్నో ఆశలతో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలనే దృఢ సంకల్పంతో నిరుద్యోగులు ఎంతో కష్టపడి ఎగ్జామ్ రాస్తారని, కానీ కొంత మంది ఈజీగా జాబ్ పొందడానికి అవకతవకలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.

అలాంటి వ్యక్తులకు జీవిత ఖైదు లేకుంటే కనీసం 10 ఏళ్ల జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. అలాగే పరీక్షలో చీటింగ్ పాల్పడిన వారి ఆస్తులను జప్తు చేస్తామని చెప్పారు. కాంపిటేటివ్ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ ను అరికట్టడానికి ఉత్తరాఖండ్ ప్రభుత్వం యాంటీ కాపీయింగ్ ఆర్డినెన్స్ తెచ్చింది. గత శుక్రవారం ఆ ఆర్డినెన్స్ ను రాష్ట్ర గవర్నర్ గుర్మీత్ సింగ్ ఆమోదించారు. వారం కిందట బెరోజ్ గర్ సంఘ్ కు చెందిన కొంతమంది నిరుద్యోగులు ఉద్యోగ నియామకాల్లో జరుగుతోన్న అవకతవకలపై సీబీఐతో విచారణ జరిపించాలని డెహ్రాడూన్ లో ధర్నాకు దిగారు. దీంతో వాళ్లను అక్కడి నుంచి తరలిచండానికి ప్రయత్నించిన పోలీసులతో ఆందోళనకారులు వాగ్వివాదానికి దిగారు. ఈ క్రమంలోనే పోలీసులపై నిరుద్యోగులు రాళ్లు విసిరారు. దీంతో పోలీసులు లాఠీ చార్జీ చేసి 13 మంది ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో 15 మంది పోలీసులు గాయపడ్డారు. వీటన్నింటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం యాంటీ కాపీయింగ్ చట్టాన్ని తీసుకొచ్చింది.

Next Story