హిడ్మా ఎన్‌కౌంటర్‌పై NHRCకి ఫిర్యాదు.. ఫేక్ ఎన్‌కౌంటర్ చేశారా?

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-11-25 06:43:34  IST  )

మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఇటీవల ఎన్ కౌంటర్లో మరణించినట్లు పోలీసులు ప్రకటించారు. అయితే ఈ ఎన్కౌంటర్ పై తమకు అనుమానాలు ఉన్నట్లు న్యాయవాది..

హిడ్మా ఎన్‌కౌంటర్‌పై NHRCకి ఫిర్యాదు.. ఫేక్ ఎన్‌కౌంటర్ చేశారా?
X

దిశ, వెబ్‌డెస్క్: ఈనెల 18వ తేదీన ఏపీలోని మారేడుమిల్లి అటవీప్రాంతంలో మావోయిస్టు అగ్రనేతల్లో ఒకరైన హిడ్మా ఎన్ కౌంటర్ లో మరణించిన విషయం తెలిసిందే. అతని ఎన్ కౌంటర్ పై అనుమానం వ్యక్తం చేస్తూ.. న్యాయవాది కె. విజయ్ కిరణ్ NHRCని ఆశ్రయించారు. హిడ్మా ఎన్ కౌంటర్ ఫేక్ అయ్యే అవకాశాలు ఉండటంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఆయన NHRCని కోరారు. హిడ్మా ఎన్ కౌంటర్ పై నమోదైన ఎఫ్ఐఆర్ నంబర్లు 52/2025, 53/2025లలో అనుమానాస్పద అంశాలున్నట్లు విజయ్ ఆరోపించారు.

NHRC గైడ్ లైన్స్ ప్రకారం.. ఎన్ కౌంటర్లో ఉన్న పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు కాలేదన్నారు. ఈ ఎన్ కౌంటర్ పై నిజనిజాలేంటో ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. హిడ్మా ఎన్కౌంటర్ పై పూర్తి సమాచారం, అందుకు సంబంధించిన సాక్ష్యాలను ప్రజలకు వివరించాలని, ఒకవేళ ఇది ఫేక్ అయితే మాత్రం ప్రభుత్వం చేసిన అతిపెద్ద తప్పిదమవుతుందన్నారు. మావోయిస్టులైనా, పోలీసులైనా.. చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం నేరమేన్నారు. న్యాయవాది విజయ్ ఫిర్యాదు మేరకు NHRC హిడ్మా ఎన్కౌంటర్ పై దర్యాప్తు చేపడుతుందా? లేదా? అన్నదానిపై సందిగ్ధత నెలకొంది.

Next Story