Pahalgam attack: పహెల్గాం ఉగ్రదాడిలో లష్కరే తోయిబా కమాండర్ ప్రమేయం

by Shamantha N |

పహెల్గాంలో ఉగ్రదాడిలో లష్కరే తోయిబా కమాండర్ ఫరూఖ్ అహ్మద్ తేడ్వా ఉన్నట్లు ఎన్ఐఏ అనుమానిస్తుంది. కశ్మీర్‌ నుంచి పారిపోయి పాక్‌లో స్థిరపడిన ఫరూఖ్‌ అహ్మద్‌ తేడ్వా ఈ దాడిలో కీలకపాత్ర పోషించినట్లు భావిస్తున్నారు.

Pahalgam attack: పహెల్గాం ఉగ్రదాడిలో లష్కరే తోయిబా కమాండర్ ప్రమేయం
X

దిశ, నేషనల్ బ్యూరో: పహెల్గాంలో ఉగ్రదాడిలో లష్కరే తోయిబా కమాండర్ ఫరూఖ్ అహ్మద్ తేడ్వా ఉన్నట్లు ఎన్ఐఏ అనుమానిస్తుంది. కశ్మీర్‌ నుంచి పారిపోయి పాక్‌లో స్థిరపడిన ఫరూఖ్‌ అహ్మద్‌ తేడ్వా ఈ దాడిలో కీలకపాత్ర పోషించినట్లు భావిస్తున్నారు. ఇటీవలే భద్రతా దళాలు కుప్వారాలో అతడి ఇంటిని పేల్చివేశాయి. గత రెండేళ్లలో కశ్మీర్‌లో చాలా ఉగ్రదాడులకు అతడు సాయం చేసినట్లు అధికారులు గుర్తించారు. ఫరూఖ్‌కు కశ్మీర్‌లోని పర్వతాలు, లోయల్లో మార్గాలపై పట్టు ఉంది. అతడే మూడు మార్గాల ద్వారా ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేందుకు సాయం చేశాడు. ఇతడికి పాక్‌లో కూడా బలమైన సంబంధాలున్నాయి. 1990-2016 మధ్య ఇరుదేశాలకు పలుమార్లు ప్రయాణించాడు. పహెల్గాంలోని ఉగ్రదాడి తర్వాత ఫరూఖ్ కు సాయం చేసిన పలువురిని అదుపులోకి తీసుకొన్నారు. ప్రస్తుతం పాక్‌లో స్థిరపడిన ఫరూఖ్‌.. కశ్మీర్‌లోని తన నెట్‌వర్క్‌తో సంబంధాలు పెట్టుకొనేందుకు సెక్యూర్డ్‌ కమ్యూనికేషన్‌ యాప్స్‌ను వినియోగిస్తున్నాడు.

పహెల్గాం దాడి

ఏప్రిల్ 22న మధ్యాహ్నం జమ్ముకశ్మీర్‌లోని పర్యాటక ప్రాంతమైన పహెల్గాం (Pahalgam)లో ఉగ్రవాదులు అమాయకులపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఉగ్రదాడిలో 26 మంది చనిపోయారు. దీంతో, భారతప్రభుత్వం పాక్ పై ప్రతీకార చర్యలకు దిగింది. వీసాలు రద్దు, సింధు జలాల ఒప్పందం నిలిపివేత, ఔషధాల ఎగుమతి, పాకిస్థాన్‌ నటుల సినిమాలు బ్యాన్‌ చేసింది. పాక్‌ విమానాలకు (Pak airlines) భారత గగనతలం (Airspace) మూసివేత దిశగా కూడా కేంద్రం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. దాడి వెనుక ఉన్న ముగ్గురు ఉగ్రవాదుల స్కెచ్‌లను పోలీసులు విడుదల చేశారు. వారికి సంబంధించిన సమాచారం చెప్తే రూ. 20 లక్షల రివార్డును ప్రకటించారు.

Next Story