- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Vijay Telepathy: విజయ్ సభలో జనసునామీ.. లక్షల్లో జనం 400 మందికి అస్వస్థత
మధులై లో టీవీకే పార్టీ నిర్వహించిన బహిరంగ సభకు ఇసుకేస్తే రాలనంత మంది హాజరయ్యారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తమిళనాడు మధురైలో టీవీకే (TVK) భారీ బహిరంగ సభలో గందరగోళం నెలకొంది. దళపతి విజయ్ (Vijay) సభకు జనం భారీగా తరలివచ్చారు. దాదాపు నాలుగు లక్షల మంది జనం హాజరు అయినట్లు చెబుతున్నారు. ఈ సభకు వచ్చిన వారిలో 400 మంది అస్వస్తతకు గురి కాగా అందులో 40 మంది పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. టీవీకే పార్టీ ఏర్పడిన తర్వాత విజయ్ నిర్వహిస్తున్న రెండో సభ ఇదే. ఈ నేపథ్యంలో ఇవాళ పార్టీ జెండాను ఎగురవేసిన విజయ్ పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగిస్తూ సింహం వేట కోసం మాత్రమే బయటకు వస్తుందని ఆటపాట కోసం బయటకు రాదని హాట్ కామెంట్స్ చేశారు. టీవీకే నేత అరుణ్ రాజ్ మాట్లాడుతూ మదురైను రక్షించిన సుందరపాండ్యుడి గురించి మీరు చదివి ఉంటారని కానీ రేపు తమిళనాడును రక్షించబోయే సుందరపాండ్యుడు ఇక్కడే ఉన్నారు అంటూ విజయ్ ని ఉద్దేశించి అన్నారు.






