Ladakh: లడఖ్ రాష్ట్ర హోదా కోసం పోరాటం కొనసాగాలి.. సోనమ్ వాంగ్‌చుక్

by B.Srinivas |

లడఖ్ రాష్ట్రహోదా కోసం పోరాటం జరగాలని, గాంధీ చూపిన మార్గంలో కొనసాగించాలని సోనమ్ వాంగ్‌చుక్ లడఖ్ ప్రజలను కోరారు.

Ladakh: లడఖ్ రాష్ట్ర హోదా కోసం పోరాటం కొనసాగాలి.. సోనమ్ వాంగ్‌చుక్
X

దిశ, నేషనల్ బ్యూరో: లడఖ్ రాష్ట్రహోదా కోసం పోరాటం జరగాలని, గాంధీ చూపిన అహింసా మార్గంలో దానిని కొనసాగించాలని సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ (Sonam Wangchuk) లడఖ్ ప్రజలను కోరారు. జోధ్‌పూర్ సెంట్రల్ జైలులో ఉన్న ఆయన ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ‘ఇటీవల జరిగిన హింసలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి. నలుగురి మరణాలపై స్వతంత్ర న్యాయ కమిషన్ దర్యాప్తు చేయాలి. అది జరిగే వరకు నేను జైలులోనే ఉండటానికి సిద్ధంగా ఉన్నా’ అని తెలిపారు. తాను శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉన్నానని రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌కు కట్టుబడి ఉన్నానని పేర్కొన్నారు.

లడఖ్ ప్రయోజనాల కోసం అపెక్స్ బాడీ తీసుకునే ఎటువంటి చర్యలకైనా తాను పూర్తి మద్దతిస్తానని వెల్లడించారు. శాంతి, ఐక్యతను కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు. లడఖ్‌కు రాష్ట్ర హోదా, రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్‌లో చేర్చాలనే డిమాండ్ రాజ్యాంగ బద్దమైందని తెలిపారు. కాగా, లడఖ్ రాజధాని లేహ్‌లో ఇటీవల జరిగిన హింసకు వాంగ్‌చుక్‌ కారణమనే ఆరోపణలతో ఆయనను జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఏ) కింద గత నెల 26న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

Next Story