- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
KTR: కారు గుర్తును పోలిన సింబల్స్ చాలా ఉన్నాయి.. అవన్నీ ఈసీ దృష్టికి తీసుకెళ్లాం
కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission)తో బీఆర్ఎస్ నేతలు భేటీ అయ్యారు. అనంతరం కేటీఆర్(KTR) మీడియాతో మాట్లాడారు.

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission)తో బీఆర్ఎస్ నేతలు భేటీ అయ్యారు. అనంతరం కేటీఆర్(KTR) మీడియాతో మాట్లాడారు. కారు గుర్తును పోలినవి దాదాపు 8, 9 సింబల్స్ ఉన్నాయి. 2019 భువనగిరి పార్లమెంట్ ఎన్నికల్లో మా పార్టీ 5 వేల ఓట్లతో ఓడిపోయింది.. కానీ మా కారు గుర్తును పోలిన రోడ్ రోలర్ గుర్తుకు ప్రచారం చేయకుండానే 27 వేల ఓట్లు వచ్చాయి. ఇలా మా పార్టీకి ఎన్నో సార్లు ఇలా జరిగింది. ఇలా ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడా 14 సీట్లు 6 వేల ఓట్లతో ఓడిపోయాము. ఇవన్నీ ఈసీ వాళ్లకు వివరించామని కేటీఆర్ అన్నారు.
కేటీఆర్‌తో వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీలు బోయినపల్లి వినోద్ కుమార్, బాల్క సుమన్, పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ బృందంలో సభ్యులు. సమావేశంలో ప్రధానంగా ఎన్నికల సంస్కరణలు, వివిధ పార్టీలు సమర్పించిన వినతులు, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ తదితర కీలక అంశాలపై చర్చించినట్లు తెలిస్తోంది. పలు రాష్ట్రాల్లో కొనసాగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. కేటీఆర్






