- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, వెబ్ డెస్క్: గాంధీ హాస్పిటల్ ఫోరెన్సిక్ మెడిసిన్ హెచ్ఓడీ ప్రొఫెసర్ డా. టి. కృపాల్ సింగ్ (Krupal singh) నేషనల్ ఐఎంఏ (In-Service Doctors Wing) వైస్ చైర్మన్‌గా నియమితులయ్యారు. ఇటీవల నిర్వహించిన ఐఎంఏ సాధారణ సర్వసభ్య సమావేశంలో కొత్త కమిటీని నామినేట్ చేయగా, కృపాల్ సింగ్ వైస్ చైర్మన్ పదవికి ఎంపికయ్యారు. ఆయన ఎంపికపై గాంధీ హాస్పిటల్, మెడికల్ కాలేజీ అధికారులు, సహచర డాక్టర్లు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఫోరెన్సిక్ మెడిసిన్ రంగంలో అపార అనుభవం కలిగిన ఆయన, వైద్యవృత్తి పట్ల ఉన్న అంకితభావంతో ఎన్నో ప్రజావైద్య సేవలు అందించారు. డా. కృపాల్ సింగ్ గతంలో కూడా పలు బాధ్యతల్ని విజయవంతంగా నిర్వహించారు. ఆయన సేవలు ఇన్సర్వీస్ డాక్టర్ల అభివృద్ధికి మరింత ఉపయోగపడతాయని ఆశిస్తున్నారు.
Next Story






