మోడీ "మన్ కీ బాత్" లో "కొమురం భీం" పోరాటం

by Muthe.Rajitha |

ప్రధాని నరేంద్ర మోడీ "మన్ కీ బాత్" రేడియో కార్యక్రమంలో భాగంగా నేడు 127వ ఎపిసోడ్ ప్రసారం అయింది.

మోడీ మన్ కీ బాత్ లో కొమురం భీం పోరాటం
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రధాని నరేంద్ర మోడీ "మన్ కీ బాత్" రేడియో కార్యక్రమంలో భాగంగా నేడు 127వ ఎపిసోడ్ ప్రసారం అయింది. ఈ కార్యక్రమంలో నరేంద్ర మోడీ సంస్కృత భాష, వందేమాతరం, కాఫీ ఉత్పత్తులు, సర్దార్ పటేల్ జయంతి వంటి పలు అంశాలతోపాటు ఆదివాసీ పోరాట యోధుడు కొమురం భీమ్‌పై ప్రశంసలు కురిపించారు. నిజాం దురాగతాలపై తన 20 ఏళ్ల వయసులోనే భీం ఎలా పోరాటం చేసాడో వివరించారు.

అక్టోబర్ 22న కొమురం భీం జయంతిని పురస్కరించుకొని.. 20వ శతాబ్దం తొలినాళ్లలో స్వాతంత్య్రం ఓ కళలా ఉండేదని.. అలాంటి సమయంలో 20 ఏళ్ల వయసులోనే కొమురం భీమ్ ఉద్యమించి ఆదివాసీల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడని తెలియజేశారు. ఎంతోమంది హృదయాల్లో చెరగని ముద్ర వేసిన భీం గురించి యువత తప్పకుండా తెలుసుకోవాలి అని మోడీ మన్‌కీ బాత్‌లో పిలుపునిచ్చారు.

Next Story