Kills father: రూ.10 కోసం తండ్రిని నరికి చంపిన కొడుకు.. ఒడిశాలో దారుణ ఘటన

by B.Srinivas |

ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. రూ.10 ఇవ్వలేదనే కారణంతో ఓ వ్యక్తి తన తండ్రినే నరికి చంపేశాడు.

Kills father: రూ.10 కోసం తండ్రిని నరికి చంపిన కొడుకు.. ఒడిశాలో దారుణ ఘటన
X

దిశ, నేషనల్ బ్యూరో: ఒడిశా (Odisha)లోని మయూర్‌భంజ్ (Mayurbhanj) జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గుట్కా కొనడానికి రూ.10 ఇవ్వలేదనే కారణంతో ఓ వ్యక్తి తన తండ్రినే నరికి చంపేశాడు. అంతేగాక హత్య చేసిన అనంతరం తన తండ్రి తలను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి లొంగిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మయూర్ భంజ్ జిల్లాలోని చందువా (Chandhuvaa) గ్రామంలో బైదర్ సింగ్ (70) అనే వ్యక్తిని తన కుమారుడు గుట్కా కొనుక్కునేందుకు రూ.10 అడిగాడు. అయితే డబ్బులు ఇచ్చేందుకు బైదర్ నిరాకరించాడు. దీంతో తల్లిదండ్రులు ఇద్దరు వారి కుమారుడికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే తీవ్ర ఆగ్రహానికి గురైన కుమారుడు ఓ పదునైన ఆయుధంతో తండ్రి తల నరికి చంపాడు. పక్కనే ఉన్న తన తల్లి భయాందోళనకు గురై అక్కడి నుంచి పారిపోయింది. అనంతరం నిందితుడు తెగి పోయిన తలను తీసుకుని చందువా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి లొంగిపోయాడు. గుట్కాకు పైసలు ఇవ్వనందుకే తండ్రిని నిందితుడు హతమార్చాడని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ ఘటనతో చందువా గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.

Next Story