- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
khamenei: అమెరికా సాధించింది ఏమీ లేదు.. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ
ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ అనంతరం ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ తొలిసారి స్పందించారు.

దిశ, నేషనల్ బ్యూరో: ఇరాన్ ఇజ్రాయెల్ (Iran Israel) మధ్య కాల్పుల విరమణ అనంతరం ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ తొలిసారి స్పందించారు. 12 రోజుల పాటు జరిగిన యుద్ధంలో తామే విజయం సాధించామని తెలిపారు. టెల్ అవీవ్ గెలుపొందడంలో సాయం చేసిన ఇరాన్ ప్రజలపై ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు గురువారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘అమెరికా ప్రభుత్వంపై గెలుపొందిన ప్రియమైన ఇరాన్ ప్రజలకు అభినందనలు. ఇజ్రాయెల్ పై దాడులతో ఆ దేశాన్ని పూర్తిగా అణచివేశాం. అమెరికా జోక్యం చేసుకోకపోతే ఇజ్రాయెల్ పూర్తిగా నాశనమవుతుందని అంతా భావించారు. ఈ భయంతోనే యూఎస్ నేరుగా యుద్ధంలోకి ప్రవేశించింది. కానీ వాషింగ్టన్ ఏమీ సాధించలేదు. ఆ దేశానికి దీటుగా బదులిచ్చాం’ అని పేర్కొన్నారు.
అమెరికాకు ఇరాన్ సరెండర్ అవ్వడం అసాధ్యమని స్పష్టం చేశారు. ఇరాన్‌పై మళ్లీ దాడి చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఇరాన్ వంటి గొప్ప దేశం ఎవరికీ లొంగిపోదని తెలిపారు. అమెరికా కీలక స్థావరాల్లో ఒకటైన అల్ ఉదీద్ మిలిటరీ స్థావరంపై దాడి చేసి నష్టం కలిగించామని, అవసరమైతే భవిష్యత్‌లోనూ ఈ తరహా దాడులు జరగొచ్చన్నారు. ఏదైనా దురాక్రమణ జరిగితే శత్రువు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని వార్నింగ్ ఇచ్చారు. కాగా, ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య 12 రోజుల పాటు యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. అనంతరం కాల్పుల విరమణతో ఇరు పక్షాల నుంచి దాడులు ఆగిపోయాయి. ఈ క్రమంలోనే ఖమేనీ స్పందించారు.






