- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ahmedabad Plane Crash : అహ్మదాబాద్ ప్రమాదం వెనుక ఖలీస్థానీ తీవ్రవాదులు!?
గుజరాత్ అహ్మదాబాద్ లో నేడు జరిగిన ఘోర విమాన ప్రమాదం(Ahmedabad Plane Crash) యావత్ దేశం ఉలిక్కిపడేలా చేసింది.

దిశ, వెబ్ డెస్క్ : గుజరాత్ అహ్మదాబాద్ లో నేడు జరిగిన ఘోర విమాన ప్రమాదం(Ahmedabad Plane Crash) యావత్ దేశం ఉలిక్కిపడేలా చేసింది. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం(Air India Boeing) ఒక్కసారిగా కుప్పకూలడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటనేదానిపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ ఘటనపై ఖలీస్థానీ తీవ్రవాదుల(Khalistani Terrorists) కుట్రకోణం ఉందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఖలీస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్ను(Gurpatwant Singh Pannun) చాలరోజులుగా భారత విమానాలపై దాడులు తప్పవని హెచ్చరిస్తూ రావడం ఈ అనుమానాలకు బలం చేకూరుతోంది.
పన్ను గత నవంబర్లో ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించే వారు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఓ వీడియో రిలీజ్ చేశారు. ప్రస్తుతం నెట్టింట్లో ఈ వీడియో వైరల్ అవుతుండగా.. ఈ ప్రమాదం వెనుక ఖలీస్థానీ తీవ్రవాదుల ప్రమేయం ఏమైనా ఉందా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.






