బికినీ ట్రెండ్.. ట్విట్టర్‌కు కేంద్రం కీలక ఆదేశాలు

by Ajay Maddhiboyina |

ప్ర‌ముఖ సోష‌ల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్ట‌ర్‌కు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. గ్రోక్ చాట్ బాట్ సృష్టిస్తున్న అస‌భ్య‌క‌ర‌మైన కంటెంట్ వెంట‌నే తొల‌గించాల‌ని ఆదేశించింది.

బికినీ ట్రెండ్.. ట్విట్టర్‌కు కేంద్రం కీలక ఆదేశాలు
X

దిశ‌, వెబ్ డెస్క్: ప్ర‌ముఖ సోష‌ల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్ట‌ర్‌కు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. గ్రోక్ చాట్ బాట్ సృష్టిస్తున్న అస‌భ్య‌క‌ర‌మైన కంటెంట్ వెంట‌నే తొల‌గించాల‌ని ఆదేశించింది. 72 గంట‌ల్లో తీసుకున్న చ‌ర్య‌ల గురించి యాక్ష‌న్ టేకెన్ రిపోర్ట్ అందజేయాల‌ని స్ప‌ష్టం చేసింది. ముఖ్యంగా మ‌హిళ‌ల‌ను, పిల్ల‌ల‌ను ల‌క్ష్యంగా చేసుకుని లైంగికంగా అస‌భ్య‌క‌ర‌మైన మ‌రియు అవ‌మాన‌క‌ర కంటెంట్ రూపొందించ‌డానికి, ప్ర‌సారం చేయ‌డానికి గ్రోక్ ను ఉప‌యోగించ‌డంపై ఆందోళ‌న వ్య‌క్తం చేసింది.

ఇది గౌరవం, గోప్య‌త మ‌రియు డిజిట‌ల్ భ‌ద్ర‌త‌ను తీవ్రంగా ఉల్లంఘించ‌డంగా భావించింది. గ్రోక్ ను వెంట‌నే రివ్యూ చేసి చెత్త కంటెంట్ తొల‌గించాల‌ని పేర్కొంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ట్విట్ట‌ర్ లో బికినీ ట్రెండ్ న‌డుస్తోంది. ఏదైనా ఫోటో అప్లోడ్ చేసి డ్రెస్ బికినీగా మార్చాలని ఆదేశిస్తే ఏఐ క్షణాల్లో మార్చేస్తోంది. దీని శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ఆందోళన వ్యక్తం చేస్తూ కేంద్ర ఐటీ మినిస్ట్రీకి లేఖ రాశారు. వెంటనే స్పందించిన కేంద్రం ఈ మేరకు చర్యలకు సిద్ధమైంది.

Next Story