- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం.. హైకోర్టును ఆశ్రయించిన ఈడీ
నేషనల్ హెరాల్డ్ (National Herald) మనీలాండరింగ్ కేసులో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: నేషనల్ హెరాల్డ్ (National Herald) మనీలాండరింగ్ కేసులో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు ఇతరులపై రౌస్ అవెన్యూ ట్రయల్ కోర్టులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED)చార్జ్‌షీట్ దాఖలు చేసింది. అయితే, ప్రైవేటు వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పీఎంఎల్‌ఏ (PMLA) కింద చర్యలు తీసుకోవడం సాధ్యం కాదని కోర్టు అభిప్రాయపడింది. అదేవిధంగా కేసులో వేసిన ఛార్జ్‌షీటు కూడా చట్టపరంగా నిలవదని డిసెంబర్ 16న న్యాయమూర్తి ఆ పిటిషన్‌ను డిస్మిస్ చేశారు. ఈ క్రమంలోనే ఇవాళ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఈడీ అధికారులు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, తాజాగా వేసిన ఈడీ ఛార్జ్‌షీటును ఢిల్లీ హైకోర్టు పరిగణలోకి తీసుకుని విచారణ చేపడుతుందా.. లేక ట్రయల్ కోర్టు మాదిరిగానే డిస్మిస్ చేస్తుందా అనేది హాట్ టాపిక్‌గా మారింది.
కాగా, సోనియా గాంధీ (Sonia Gandhi), రాహుల్ గాంధీ (Rahul Gandhi)లు యంగ్ ఇండియన్ సంస్థలో 38 శాతం చొప్పున షేర్లు కలిగి ఉన్నారని ఈడీ ఆరోపించింది. ఏజేఎల్‌కు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రూ.90.21 కోట్ల రుణాన్ని రూ.9.02 కోట్ల ఈక్విటీ షేర్లుగా మార్చి.. ఆ షేర్లను రూ.50 లక్షలకు యంగ్ ఇండియన్‌కు బదిలీ చేశారని పేర్కొంది. తద్వారా రూ.2 వేల కోట్ల నుండి రూ.5 వేల కోట్ల విలువైన ఏజేఎల్ ఆస్తులపై నియంత్రణ సాధించారని ఈడీ ఆరోపించింది. దీంతో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA) సెక్షన్లు 3, 4, మరియు 70 కింద వారిపై ఛార్జిషీటు దాఖలు చేశారు. ఏప్రిల్ 11, 2025న ఈడీ ఢిల్లీ, ముంబై, లక్నోలలో రూ.661 కోట్ల విలువైన ఏజేఎల్ ఆస్తులను సైతం ఆటాచ్ చేసిన విషయం తెలిసిందే.






