- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Disha Salian: మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపిన దిశా శాలియన్ మృతి కేసులో కీలక పరిణామం
దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా శాలియన్ మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.

దిశ, డైనమిక్ బ్యూరో: దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా శాలియన్ (Disha Salian) మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. (Former celebrity manager Disha Salian) దిశా సాలియన్ హత్యకు గురయ్యారని, ఆమెపై లైంగిక దాడి జరిగిందని దిశా తండ్రి సతీశ్ శాలియన్ గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని, దిశా హత్యకు ముందే ఆమెపై సామూహిక అత్యాచారం జరిగిందని తండ్రి ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే విచారణ చేపట్టిన ముంబాయి పోలీసులు తాజాగా కోర్టుకు కీలక విషయాలు వెల్లడించారు. దిశా హత్య, లైంగిక దాడి జరిగిందని నిరూపించడానికి వైద్య లేదా శాస్త్రీయ ఆధారాలు ఏవీ నిర్ధారణ కాలేదని ముంబాయి పోలీసులు బుధవారం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. దిశా హత్యకు గురైందని, శివసేన (ఠాక్రే వర్గం) ఎమ్మెల్యే ఆదిత్య థాకరే (Aditya Thackeray) హత్యలో ప్రమేయం ఉందని పిటిషనర్ల ఆరోపణలకు మద్దతు ఇచ్చే ఆధారాలు కూడా లేవని, దిశా శాలియన్ ఆత్మహత్య చేసుకోని మరణించారని పూర్తి నివేదికను పోలీసులు బాంబే హైకోర్టుకు సమర్పించారు. ఈ ఆఫిడవిట్‌లో దిశా తండ్రి సతీశ్ చేసిన ఆరోపణలు తోసిపుచ్చారు.
దిశా శాలియన్ తనంతట తానుగా ఒక ఫ్లాట్ కిటికీ నుంచి దూకిందని, పోస్ట్ మార్టం నివేదికలో ఆమెపై లైంగిక దాడి, శారీరక దాడికి సంబంధించిన ఆనవాళ్లు లేవని పోలీసులు హైకోర్టు ఆఫిడవిట్‌లో తెలిపారు. తన కుటుంబంతో వివాదం కారణంగా, ఆమె వ్యాపార ఒప్పందాల విషయంలో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైందని ఆఫిడవిట్‌లో పేర్కొన్నారు. కాగా, దిశా శాలియన్ మాజీ సెలబ్రిటీ మేనేజర్ 2020 జూన్ 8న అనుమానాస్పద స్థితిలో మరణించారు. మాలాడ్‌లోని ఒక భవనం 14 వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు దర్యాప్తులో తేల్చారు. ఆ తరువాత తండ్రి చేసిన ఆరోపణలతో 2022 డిసెంబరులో ‘సిట్’ ఏర్పాటైంది. సిట్ దర్యాప్తులో కూడా ఆత్మహత్యగా తేల్చి చెప్పారు.
కాగా, ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోందని, పూర్తి నివేదికను సమర్పించిన నేపథ్యంలో ఈ కేసును కొట్టివేయాలని తాజాగా ఆఫిడవిట్‌లో పోలీసులు పేర్కొన్నారు. ఇక, దిశా శాలియన్ ఆత్మహత్య మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. శివసేన (ఠాక్రే వర్గం) ఎమ్మెల్యే, నాటి సీఎం కుమారుడు అయిన ఆదిత్య థాకరే ఈ కేసులో ప్రమేయం ఉందని ఆరోపణలు రావడం కేసు తీవ్ర సంచలనం రేపింది. కేసులో ఆయన ప్రమేయం లేదని పోలీసులు తాజాగా క్లీన్ చిట్ ఇచ్చారు.






