కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు

by Ajay Maddhiboyina |

కేంద్ర కేబినెట్ నేడు స‌మావేశం అయ్యింది. ఈ స‌మావేశంలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. పూణేలోని మెట్రో లైన్ ఫేజ్-2 కోసం రూ.3,626 కోట్ల రూపాయ‌ల‌ను మంజూరు చేసింది.

కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు
X

దిశ‌, వెబ్ డెస్క్: కేంద్ర కేబినెట్ నేడు స‌మావేశం అయ్యింది. ఈ స‌మావేశంలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. పూణేలోని మెట్రో లైన్ ఫేజ్-2 కోసం రూ.3,626 కోట్ల రూపాయ‌ల‌ను మంజూరు చేసింది. ఆగ్రాలోని పొటాటో రీజ‌న‌ల్ సెంట‌ర్ ఏర్పాటుకు రూ.111.5 కోట్లు మంజూరు చేసింది. అదే విధంగా కోల్డ్ ఫీల్డ్ రీహాబిటేష‌న్ కోసం రివైజ్డ్ మాస్ట‌ర్ ప్లాన్‌కు రూ.5,940 కోట్ల రూపాయలు కేటాయించింది. అంతే కాకుండా దేశంలో ఎమ‌ర్జెన్సీ విధించి 50 ఏళ్లు పూర్త‌వ్వ‌డంతో ఎమెర్జెన్సీని ఖండిస్తూ ఓ తీర్మానాన్ని ఆమెదించింది. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితిలో ప్రాణాలు కోల్పోయిన‌వారిని స్మ‌రించుకుంటూ మంత్రి వ‌ర్గం రెండు నిమిషాలు మౌనం పాటించింది. మ‌రోవైపు ప్ర‌ధాని మోడీ పౌర హ‌క్కుల అణ‌చివేత మ‌రియు మీడియాపై ఆంక్ష‌ల ప‌ట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ సోష‌ల్ మీడియాలోనూ ఓ పోస్ట్ పెట్టారు. ది ఎమ‌ర్జెన్సీ డైరీస్ అనే పుస్త‌కం ఎమ‌ర్జెన్సీలో త‌న ప్రయాణం ఎలా సాగిస్తుందో వివ‌రిస్తుంద‌ని పేర్కొన్నారు.

Next Story