ప్రపంచాన్ని కమ్మేస్తోన్న ‘అమెరికా - ఇజ్రాయెల్’ అగ్ని!

by Gantepaka Srikanth |   (  Updated:2026-03-03 12:49:11  IST  )

యుద్ధంపై ఇరాన్ విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయి కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రపంచాన్ని కమ్మేస్తోన్న ‘అమెరికా - ఇజ్రాయెల్’ అగ్ని!
X

దిశ, వెబ్‌డెస్క్: యుద్ధంపై ఇరాన్ విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయి(Esmail Baghai) కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మేము యుద్ధం ఏనాడూ కోరుకోలేదు. అసలు యుద్ధమే మేము ప్రారంభించలేదు. ఇజ్రాయెల్ - అమెరికా కలిసి తమపై యుద్ధాన్ని ప్రకటించాయి. వాళ్లే మొదలెట్టారు.. కాబట్టి వాళ్లే ఆపేయాలి. మేము ఎప్పుడూ దౌత్య మార్గమే ఎంచుకున్నాము. అమెరికా - ఇజ్రాయెల్ రగిలించిన అగ్రి ఇప్పుడు ప్రపంచమంతా కమ్మేస్తోంది. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. అంతర్జాతీయ సమాజం మధ్యవర్తిత్వం వహిస్తే పరిస్థితిని అదుపులోకి తీసుకురావడం సులభమే. మరోవైపు యూరప్ వైఖరి కూడా సరిగా లేదు. యూరల్ దేశాల నిర్లక్ష్య వైఖరి వీడాలి. దాడులను యూరప్ దేశాలు ఖండించాలి. దీనికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(UNSC) బాధ్యత తీసుకోవాలి’ అని ఇస్మాయిల్ బఘాయి పేర్కొన్నారు.

మరోవైపు ఇరాన్‌పై దాడికి గల కారణాలను అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో విశ్లేషించారు. "ఇజ్రాయెల్ దాడి చేయబోతోందని మాకు తెలుసు. ఆ దాడి జరిగిన వెంటనే ఇరాన్ గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా బలగాలపై ప్రతీకార దాడులకు దిగుతుందని మా వద్ద స్పష్టమైన సమాచారం ఉంది. ఒకవేళ మేము ముందే అప్రమత్తమై వారి క్షిపణి వ్యవస్థలను దెబ్బ తీయకపోతే.. మా సైనికులు భారీగా ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చేది. అందుకే ఎదురుదెబ్బ తినడం కంటే ముందే శత్రువును దెబ్బకొట్టాలని అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం అత్యంత తెలివైనది" అని ఆయన పేర్కొన్నారు.

గల్ఫ్‌లో ఉద్రిక్తతల మధ్య ఒమన్‌, కువైట్‌ నేతలతో ప్రధాని మోడీ కీలక చర్చలు.. భారతీయుల భద్రతపై ఆరా

Next Story