"సంచార్ సాథీ యాప్"పై కేంద్రం కీలక ప్రకటన

by Muthe.Rajitha |

'సంచార్ సాథీ యాప్'పై కేంద్రం వెనక్కి తగ్గింది. మొబైల్ ఫోన్లలో సంచారీ సాథీ యాప్ ఇన్స్టాలేషన్ తప్పనిసరి కాదంటూ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

సంచార్ సాథీ యాప్పై కేంద్రం కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్ : 'సంచార్ సాథీ యాప్'పై కేంద్రం వెనక్కి తగ్గింది. మొబైల్ ఫోన్లలో సంచార్ సాథీ యాప్ ఇన్స్టాలేషన్ తప్పనిసరి కాదంటూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. కాగా భారత్‌లో విక్రయించే అన్ని కొత్త మొబైల్ ఫోన్‌లలో సంచార్ సాథీ యాప్‌ను తప్పనిసరిగా ప్రీ-ఇన్‌స్టాల్ చేయాలని, దాని ఫంక్షన్‌లను ఎవరూ డిసేబుల్ చేయకూడదని కేంద్ర టెలికాం శాఖ ఆదేశాలు జారీ చేసింది. అయితే కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ప్రజల ప్రైవసీ ఉల్లంఘన అంటూ విపక్షాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి. అంతేకాదు పెగాసస్ లాంటి స్నూపింగ్ టూల్, బిగ్ బ్రదర్ వాచ్( ప్రజలపై నిఘా) అంటూ ఇటు విపక్షాలు, అటు యాక్టివిస్టుల నుంచి తీవ్ర విమర్శలు చేయడంతో కేంద్రం దిద్దుబాటు చర్యలకు దిగి.. యాప్ ఇన్స్టాలేషన్ తప్పనిసరి కాదని వివరణ ఇచ్చింది.

మొబైల్ యూజర్లు 'సంచార్ సాథీ యాప్' ను ఎప్పుడైనా డిలీట్ చేసుకోవచ్చని, రిజిస్టర్ చేయకపోతే అది పూర్తిగా ఇనాక్టివేట్ గానే ఉంటుందని స్పష్టం చేస్తూ కేంద్ర ప్రభుత్వం నేడు అధికారిక ప్రకటన జారీ చేసింది. దీంతో కొత్త ఫోన్లలో ఇంబిల్ట్ గా సంచారీ సాథీ యాప్ ఉన్నప్పటికీ, మొబైల్ కొనుగోలు చేశాక యూజర్ దానిని తొలగించుకునే పూర్తి స్వేచ్ఛ ఉంది.

Next Story