AICC: ఏప్రిల్ 8, 9 తేదీల్లో ఏఐసీసీ కీలక సమావేశాలు.. ఒకే చోటుకి కాంగ్రెస్ నేతలు

by Ramesh Naini |

గుజరాత్‌లోని అహ్మదాబాద్ వేదికగా జాతీయ కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశాలు నిర్వహించనుంది.

AICC: ఏప్రిల్ 8, 9 తేదీల్లో ఏఐసీసీ కీలక సమావేశాలు.. ఒకే చోటుకి కాంగ్రెస్ నేతలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: గుజరాత్‌లోని అహ్మదాబాద్ వేదికగా జాతీయ కాంగ్రెస్ పార్టీ (Congress) కీలక సమావేశాలు నిర్వహించనుంది. గతేడాది డిసెంబర్‌లో కర్ణాటకలోని బెళగావిలో జరిగిన నవ సత్యాగ్రహంలో తీసుకున్న నిర్ణయాల ఆధారంగా ఏఐసీసీ సమావేశాలు నిర్వహించనున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ (K C Venugopal) ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం ఎక్స్ వేదికగా ప్రకటన విడుదల చేశారు. ఏప్రిల్ 8 వ తేదీన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం జరగనుండగా, ఏప్రిల్ 9న ఏఐసీసీ ప్రతినిధుల సమావేశం ఉంటుందని తెలిపారు. ఈ రెండు సమావేశాలకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షత వహించనున్నట్లు పేర్కొన్నారు.

ఈ భేటీలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలను ఒక చోటుకు చేర్చడమే కాకుండా, బీజేపీ కేంద్ర సర్కార్ తీరుపై భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నట్లు కేసీ వెల్లడించారు. ఈ సమావేశాలకు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు, పార్టీ జాతీయ ఆఫీస్ బేరర్లు, సీనియర్ నేతలు, తదితర ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు.

Next Story