- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
తిరువనంతపురం: కేరళ లో కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. ఆదివారం ఒక్క రోజులో 51,570 కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు పాజిటివిటీ రేటు ఏకంగా 50 శాతానికి చేరువైంది. రోజువారీ పాజిటివిటీ రేటు 49.89శాతానికి చేసినట్లు తెలిపారు. ఇక కరోనా వైరస్ బారిన పడి 14 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,54,595 క్రియాశీలక కేసులు ఉన్నాయి. మరోవైపు దేశంలో కరోనా కేసులు గత ఐదు రోజులుగా తగ్గుముఖం పట్టాయి.
తాజాగా ఒక్క రోజులో 2,34,281 కొత్త కేసులు వెలుగు చూసినట్లు అధికారులు వెల్లడించారు. అదే సమయంలో వైరస్ బారిన పడి 893 మంది మరణించారు. గత 24 గంటల్లో 3,52,784 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 18,84,937 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు రోజువారీ పాజిటివిటీ రేటు 14.50శాతంగా ఉంది.
Next Story






