- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పేదరికాన్ని జయించిన కేరళ.. దేశంలో బెస్ట్ స్టేట్‌గా రికార్డు
కేరళ(Kerala) రాష్ట్రం అరుదైన ఘనత సాధించింది.

దిశ, వెబ్‌డెస్క్: కేరళ(Kerala) రాష్ట్రం అరుదైన ఘనత సాధించింది. దారిద్ర్య రహిత రాష్ట్రంగా కేరళ అవతరించినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ (CM Pinarayi Vijayan) ప్రకటించారు. దేశంలో అత్యంత దుర్భర పేదరికాన్ని నిర్మూలించిన తొలి రాష్ట్రంగా గుర్తింపు పొందిందని చెప్పారు. కేరళ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ విషయాన్ని అధికారికంగా రివీల్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు 21,263 మందికి మొదటిసారిగా రేషన్ కార్డులు, ఆధార్, పెన్షన్లు వంటి ముఖ్యమైన పత్రాలు మంజూరుచేసిందని తెలిపారు. 4,394 కుటుంబాలకు జీవనోపాధి ప్రాజెక్టుల ద్వారా పని కల్పించామన్నారు. ప్రజలందరికీ సమాన హక్కులు నివాసం, విద్య, వైద్యం అందుతున్నట్లు తెలిపారు. దీనివల్ల రాష్ర్టం అత్యంత దుర్భర పేదరికం నుంచి బయటపడిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కాగా, భారతదేశంలో తీవ్ర పేదరికం నుండి విముక్తి పొందిన మొదటి రాష్ట్రంగా అవతరించినందుకు కేరళను చైనా అభినందించింది.






