kejriwal: ఉపరాష్ట్రపతితో కేజ్రీవాల్ భేటీ.. రాజకీయాల్లో సంచలనం !

by B.Srinivas |

ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కేజ్రీవాల్, ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్‌లు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్‌తో ఆదివారం భేటీ అయ్యారు.

kejriwal: ఉపరాష్ట్రపతితో కేజ్రీవాల్ భేటీ.. రాజకీయాల్లో సంచలనం !
X

దిశ, నేషనల్ బ్యూరో: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ (Aravindh Kejriwal) , ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్‌లు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్‌ (Jagadheep dhakad) తో ఆదివారం భేటీ అయ్యారు. ఢిల్లీలోని వైస్ ప్రెసిడెంట్ నివాసంలో సమావేశమయ్యారు. ‘ఉపరాష్ట్రపతి ఆరోగ్యంపై ఆరా తీసేందుకు ఆయనతో భేటీ అయ్యా. జగదీప్ ఆరోగ్యకరమైన జీవితం కోసం దేవుడిని ప్రార్థిస్తున్నా’ అని కేజ్రీవాల్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. వీరు ఎందుకు భేటీ అయ్యారోననే వివరాలు బయటకు రాలేదు. అయితే ఇండియా కూటమి నుంచి ఆప్ వైదొలడం, పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ఒక రోజు ముందే ఉపరాష్ట్రపతితో కేజ్రీవాల్ సమావేశమవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అంతకుముందు కేజ్రీవాల్ జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) చీఫ్ శిబూ సోరెన్‌తోనూ భేటీ అయ్యారు.

Next Story