Pahalgam: ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి కశ్మీర్ హర్తాళ్

by Vemula.Srinu Prasad |

ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి కశ్మీర్‌లో హర్తాళ్ పాటించారు...

Pahalgam: ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి  కశ్మీర్ హర్తాళ్
X

దిశ, వెబ్ డెస్క్: పహల్గామ్‌ దాడి ఘటన(Pahalgam terror Attack)‌పై దక్షిణ కశ్మీర్‌(Kashmir)లో నిరసలు వెల్లువెత్తాయి. కొత్త, పాత నగరంతో పాటు శ్రీనగర్(Srinagar) కూడా మూతపడింది. 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారిగా కశ్మీర్ లోయలో ప్రజలు బుధవారం పూర్తి హర్తాళ్ పాటించారు. స్వచ్ఛంగా దుకాణాలు, విద్యాసంస్థలు మూసివేశారు.వాహనదారులు కూడా నిరసనల్లో పాల్గొన్నారు. ఎక్కడికక్కడ వాహనాలను నిలిపివేశారు. దీంతో రోడ్లు నిర్మాణుష్యంగా మారిపోయాయి. వ్యాపార కేంద్రమైన లాల్‌చౌక్‌ కూడా మూతపడింది. అన్ని మార్కెట్లు సైతం స్వచ్ఛందంగా మూసివేశారు. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ కశ్మీర్ మూతపడిందని వీధి వ్యాపారులు తెలిపారు.

కాగా దక్షిణ కాశ్మీర్‌ పహల్గామ్‌లో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో మొత్తం 25 మంది భారతీయులతో పాటు ఓ నేపాలీ మృతి చెందారు. ఈ చర్యలను యావత్తు దేశం మొత్తం ఖండించింది. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. ఈ ఘటనపై కేంద్రప్రభుత్వం సీరియస్ అయింది. ప్రతికారం ఉంటుందని ప్రకటించింది. మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించింది.

Next Story