Israel: ఇరాన్ తో భీకర పోరు వేళ భారత్ కు ఇజ్రాయెల్ క్షమాపణలు.. కారణం ఇదే

by Prasad Jukanti |   (  Updated:2025-06-14 15:51:24  IST  )

భారత్ కు ఇజ్రాయెల్ క్షమాపణలు చెప్పింది.

Israel: ఇరాన్ తో భీకర పోరు వేళ భారత్ కు ఇజ్రాయెల్ క్షమాపణలు.. కారణం ఇదే
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇజ్రాయెల్ (Israel), ఇరాన్ (Iran) మధ్య భీకర పోరు వల్ల పశ్చిమాసియా భగ్గుమంటోంది. ఇరు దేశాల మధ్య తీవ్ర స్థాయిలో యుద్ధం మొదలుకావడం ప్రపంచ దేశాలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇజ్రాయెల్ తాజాగా భారత్ కు (India) క్షమాపణలు చెప్పింది. నిన్న ఇరాన్ లోని అణు స్థావరాలపై ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లయన్ (Operation Rising Lion) పేరుతో దాడులు చేసింది. ఈ దాడుల వివరాలను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఎక్స్ వేదికగా ఓ మ్యాప్ ను షేర్ చేసింది. ఇరాన్ ఇజ్రాయెల్ అంతిమ లక్ష్యం కాదు. ఇది ప్రారంభం మాత్రమే. ఆ దేశం ప్రపంచం మొత్తానికి ముప్పే. అందువల్ల మాకు మరో అవకాశం లేదు. అని ఐడీఎఫ్ ఆ పోస్టులో పేర్కొంది. ఈ సందర్భంగా ఈ దాడులకు సంబంధించి షేర్ చేసిన మ్యాప్ లో జమ్మూకశ్మీర్ ను పాకిస్థాన్ భూభాగంలో చూపిండం భారతీయులను ఆగ్రహానికి గురి చేసింది. దీనిపై భారత్ లోని నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ పోస్టును వెంటనే ఉపసంహరించుకోవాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు పలువురు నెటిజన్లు ట్యాగ్ చేశారు. భారతదేశం ఎందుకు తటస్థంగా ఉందో ఇప్పుడు మీకు అర్థమైంది. దౌత్యంలో, ఎవరూ నిజంగా మీ స్నేహితులు కారు అంటూ కామెంట్స్ చేశారు. నెటిజన్ల ఆగ్రహంతో ఐడీఎఫ్ రియాక్ట్ అయింది. ఇది కేవలం ఇరాన్ ముప్పు పొంచి ఉన్న ప్రాంతాలను ఉదాహరించడం కోసం చేసిన పోస్టు మాత్రమేనని ఇందులో ఉపయోగించిన మ్యాప్ ఫోటో దేశాల సరిహద్దులను కచ్చితంగా చూపించడంలో విఫలమైందని పేర్కొంది. ఈ తప్పిదానికి క్షమాపణలు కోరుతున్నాం అని మరో పోస్టు చేసింది.

Next Story