Karnataka: కర్ణాటకలో మళ్లీ కుల గణన చేపడతాం.. సీఎం సిద్ధరామయ్య

by B.Srinivas |

కర్ణాటకలో మళ్లీ కొత్తగా కుల గణన చేపడతామని సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు. 2015లో నిర్వహించిన కుల గణనను ఆమోదించలేదని తెలిపారు.

Karnataka: కర్ణాటకలో మళ్లీ కుల గణన చేపడతాం.. సీఎం సిద్ధరామయ్య
X

దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటకలో మళ్లీ కొత్తగా కుల గణన చేపడతామని సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah) ప్రకటించారు. 2015లో నిర్వహించిన కుల గణనను ప్రభుత్వం ఆమోదించలేదని తెలిపారు. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 7 వరకు సామాజిక-ఆర్థిక, విద్యా సర్వేను నిర్వహిస్తామని చెప్పారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గత కసరత్తు జరిగి పదేళ్లు గడిచిపోయాయని, సమాజంలోని ప్రస్తుత వాస్తవాలను తెలుసుకోవడానికి కొత్త సర్వే అవసరమని నొక్కి చెప్పారు. సమాజంలో వైవిధ్యం, అసమానతలు ఉన్నాయని అసమానతలను తొలగించి ప్రజాస్వామ్యానికి బలమైన పునాదులను సృష్టించే దిశగా ఈ సర్వే కీలకంగా మారుతుందన్నారు. అందరూ సమానంగా ఉండాలని, సామాజిక న్యాయం జరగాలని రాజ్యాంగం చెబుతోందన్నారు. ఈ గణనకు పౌరులు పూర్తి సహకారం అందించాలని కోరారు. ప్రతి ఒక్కరికీ సమర్థవంతమైన సంక్షేమ కార్యక్రమాలను రూపొందించడానికి అవసరమైన డేటాను సర్వేతో పొందుతాయని తెలిపారు.

Next Story