కాంగ్రెస్‌ సర్కార్‌కు BIG షాక్.. మంత్రి రాజీనామా

by Gantepaka Srikanth |

కాంగ్రెస్ ప్రభుత్వానికి బిగ్ షాక్ తగిలింది.

కాంగ్రెస్‌ సర్కార్‌కు BIG షాక్.. మంత్రి రాజీనామా
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వానికి బిగ్ షాక్ తగిలింది. కర్ణాటక మంత్రి కేఎన్‌ రాజన్న(Minister KN Rajanna) తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సమర్పించారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ మద్దదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో ఆయన పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చిందని లేఖలో పేర్కొనట్లు సమాచారం.

ఇదిలా ఉంటే.. కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికల సంఘం పక్షపాతంతో వ్యవహరిస్తోందని.. బెంగళూరు సెంట్రల్‌ వంటి కీలక నియోజకవర్గాల్లో పార్టీ ఓటమికి ఓట్ల చోరీయే కారణమని ఆరోపించారు. అయితే రాహుల్ వ్యాఖ్యలను మంత్రి రాజన్న వ్యతిరేకించారు. దీంతో రాజన్నపై అటు కాంగ్రెస్ అధిష్టానం, ఇటు డీకే శివకుమార్ వర్గం తీవ్రంగా మండిపడింది. ఈ క్రమంలో ఆయన తప్పక రాజీనామా చేయాల్సిన అనివార్య పరిస్థితి వచ్చినట్లు తెలుస్తోంది.




Next Story