తెలుగు ప్రజలకు బిగ్ షాక్.. కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం

by Gantepaka Srikanth |   (  Updated:2025-05-27 11:44:34  IST  )

కర్ణాటక(Karnataka)లో స్థిరపడాలనుకునే తెలుగు ప్రజలకు అక్కడి ప్రభుత్వం అనూహ్య షాకిచ్చింది.

తెలుగు ప్రజలకు బిగ్ షాక్.. కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటక(Karnataka)లో స్థిరపడాలనుకునే తెలుగు ప్రజలకు అక్కడి ప్రభుత్వం అనూహ్య షాకిచ్చింది. కర్ణాటక స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్(Stamps and Registration Department) కొత్త నిబంధనను తీసుకొచ్చింది. ఇకపై రూ.30 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ విలువైన ఆస్తుల క్రయవిక్రయాలకు సంబంధించి, సబ్ రిజిస్ట్రార్లు తప్పనిసరిగా 'స్పెసిఫైడ్ ట్రాన్సాక్షన్ స్టేట్‌మెంట్' తీసుకోవాలని రూల్ తెచ్చింది. ఈ స్టేట్‌మెంట్‌లో పాన్, ఆధార్, చిరునామా, ఫోన్ నంబర్, ఈమెయిల్, చెల్లింపు విధానం వంటి వివరాలు తప్పనిసరిగా ఉండాలి. ఈ వివరాలు అందించడంలో విఫలమైతే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను నిలిపివేస్తారు. అయితే.. ఇది కర్ణాటకలో స్థిరపడాలనుకునే తెలుగు ప్రజలకు ముఖ్యమైన అంశంగా మారింది.

ఆదాయపు పన్ను శాఖ అధికారుల నుంచి వచ్చిన అభ్యంతరాల నేపథ్యంలో కర్ణాటక స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో చాలామంది సబ్ రిజిస్ట్రార్‌లు ఈ వివరాలను అందించడంలో అలసత్వం వహించారు. తాజాగా జారీ చేసిన ఆదేశాల ప్రకారం.. రిజిస్ట్రేషన్ సమయంలో పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ వివరాలతో పాటు ఇతర లావాదేవీల సమాచారాన్ని సమర్పించని పక్షంలో రిజిస్టర్ చేసిన డాక్యుమెంట్‌లు సంబంధిత వ్యక్తులకు అందించరు. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఆర్థిక లావాదేవీల్లో మరింత పారదర్శకతను తీసుకువచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

Next Story