రాజ్‌నాథ్ సింగ్‌తో కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎం భేటీ.. కీలక ప్రతిపాదనలు!

by Kema Shiva Kumar |

కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ (Rajnath Singh)ను బుధవారం రాత్రి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య (CM Siddaramaiah), డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (DK Shiva Kumar) మర్యాదపూర్వకంగా కలిశారు.

రాజ్‌నాథ్ సింగ్‌తో కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎం భేటీ.. కీలక ప్రతిపాదనలు!
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ (Rajnath Singh)ను బుధవారం రాత్రి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య (CM Siddaramaiah), డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (DK Shiva Kumar) మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మైసూర్ దసరా పండుగ సందర్భంగా ఎయిర్ షో నిర్వహించాలని రాజ్‌నాథ్ సింగ్‌ను కోరారు. అదేవిధంగా బెంగళూరు (Bengaluru)లో పట్టణ పరిధిలో అభివృద్ధి ప్రాజెక్టులకు గాను రక్షణ శాఖ భూమి కేటాయింపు వంటి పలు కీలక అంశాలపై చర్చించారు. ప్రతిపాదిత రక్షణ కారిడార్, సొరంగం, బళ్లారి రోడ్డుపై లింక్ రోడ్డు, బెంగళూరులో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ వంటి అనేక ప్రాజెక్టులకు రక్షణ శాఖకు చెందిన భూమి అవసరమని సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) అపాయింట్‌మెంట్ కూడా కోరినట్లు సీఎం సిద్ధరామయ్య వెల్లడించారు.

Next Story