Karge: ట్రంప్‌తో టారిఫ్‌లు, డిపోర్టేషన్‌పై చర్చించాలి.. మోడీకి కాంగ్రెస్ చీఫ్ ఖర్గే సూచన

by B.Srinivas |

అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ కానున్న నేపథ్యంలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే మోడీకి పలు సూచనలు చేశారు.

Karge: ట్రంప్‌తో టారిఫ్‌లు, డిపోర్టేషన్‌పై చర్చించాలి.. మోడీకి కాంగ్రెస్ చీఫ్ ఖర్గే సూచన
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ (Donald Trump)తో ప్రధాని నరేంద్ర మోడీ (Narendra modi) భేటీ కానున్న నేపథ్యంలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun karge) మోడీకి పలు సూచనలు చేశారు. సుంకాలు (Tarrifs), డిపోర్టేషన్ (Deportation) అంశాలను ట్రంపు వద్ద లేవనెత్తాలని డిమాండ్ చేశారు. ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై అమెరికా 25 శాతం సుంకం విధిస్తోందని, ఈ చర్యలు భారతదేశ తయారీ రంగంపై తీవ్రమైన పరిణామాలను కలిగిస్తాయని తెలిపారు. అమెరికా భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వాములలో ఒకటి కాబట్టి పరస్పరం ప్రయోజనకరమైన సంబంధాలను ఏర్పరచుకోవాలని పేర్కొన్నారు. అలాగే భారతీయ వలసదారుల చేతులకు సంకెళ్లు, కాళ్లకు గొలుసులు వేసి వారిని బహిష్కరించడం బాధాకరమైందని, ఈ పరిణామం భారతీయులందరిలో ఆందోళన కలిగించిందని తెలిపారు.

ఏ భారతీయ పౌరుడినీ యూఎస్ అవమానించకూడదని, అత్యంత గౌరవంగా చూడాలని ప్రధాని మోడీ నొక్కి చెప్పాలని సూచించారు. ‘ఇరు దేశాల మధ్య కీలక ద్వైపాక్షిక సమస్యలు వెలుగు చూసినప్పటికీ భారతీయులు అమెరికాతో విలువైన సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని గుర్తిస్తారు. దేశ ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ఒకరినొకరు సహాయం చేసుకోవడానికి, రెండు ప్రజాస్వామ్య దేశాల మధ్య సంబంధాన్ని మరింత బలోపేతం చేయడానికి కృషి చేయాలి’ అని తెలిపారు. కాగా, ప్రస్తుతం ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ అక్కడి నుంచి అమెరికా వెళ్లనున్న విషయం తెలిసిందే.

Next Story