- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కంచుకోట అబూజ్‌మడ్ ఖాళీ.. అగ్రనేత ఆశన్నతో పాటు 208 మంది మావోయిస్టులు సరెండర్
అగ్రనేతల వరుస సరెండర్లు మావోయిస్టు పార్టీని ఊపిరి పీల్చుకోకుండా చేస్తున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: అగ్రనేతల వరుస సరెండర్లు మావోయిస్టు పార్టీని ఊపిరి పీల్చుకోకుండా చేస్తున్నాయి. ఓ వైపు ఉధృతంగా కొనసాగుతోన్న ఆపరేషన్ కగార్.. మరోవైపు కేంద్ర హోంమత్రి అమిత్ షా హెచ్చరికలు ఆయా మావోయిస్టుల కేడర్లలో ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి. ఆయుధాలను స్వచ్ఛందంగా వదిలేసి ప్రజాక్షేత్రం పోరాటం చేసేందుకు మావోయిస్టు కేడర్లు ఆసక్తి చూపుతున్నాయి. ఈ దరిమిల దేశంలోనే మావోయిస్టు ఉద్యమ చరిత్రలో మరో అతిపెద్ద సరెండర్ జరిగింది. పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు తక్కెళ్లపల్లి వాసుదేవ రావు అలియాస్ ఆశన్న అలియాస్ రూపేశ్, మాడ్ డివిజన్ కార్యదర్శి రనిత ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ ఎదుట జగ్దల్‌పూర్‌లో లొంగిపోయారు. అనంతరం వారికి సీఎం భారత రాజ్యంగ ప్రతులను అందజేశారు. లొంగిపోయిన వారితో పాటు మరో 208 మంది పార్టీ సభ్యులు కూడా సరెండర్ అయ్యారు. వారిలో 110 మంది మహిళలు, 98 మంది పురుషులు ఉన్నారు. ఈ సందర్భంగా వారు భారీగా తుపాకులు, మారణాయుధాలను పోలీసులకు అప్పగించారు. స్వాధీనం చేసుకున్న వాటిలో 153 తుపాకులు, 11 గ్రనేడ్ లాంచర్లు, 41 సింగిల్ షాట్ గన్స్, లైట్ మెషీన్ గన్స్ ఉన్నాయి.






