- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Justice Varma: నోట్ల కట్టల కేసులో అభిశంసనపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన జస్టిస్ యశ్వంత్ వర్మ
ఈ వ్యవహారంలో న్యాయ సూత్రాలను పాటించలేదని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: ఇంట్లో కాలిన కరెన్సీ నోట్ల కట్టల వ్యవహారంలో చిక్కులను ఎదుర్కొంటున్న అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆధారాలను బట్టి సుప్రీంకోర్టు దర్యాప్తు కమిటీ నిర్ణయాన్ని పరిగణలోకి తీసుకుని కేంద్రం తనపై అభిశంసన చర్యలకు సిఫార్సు చేసిన నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు దేశ అత్యున్నత న్యాయస్థానంలో వర్మ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యవహారంలో న్యాయ సూత్రాలను పాటించలేదని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. పూర్తిస్థాయిలో, పారదర్శకంగా విచారణ జరపకుండానే సుప్రీంకోర్టు మాజీ సీజేఐ సంజీవ్ ఖన్నా ఏకపక్షంగా విచారణ కమిటీ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన విచారణ కమిటీ నివేదికను రద్దు చేయాలని జస్టిస్ వర్మ కోరారు. ఈ విచారణ ఒక వ్యక్తిగా, రాజ్యాంగ కార్యకర్తగా తన హక్కులను ఉల్లంఘిస్తోందని ఆయన వాదించారు. భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా చేసిన అభిశంసన సిఫార్సును పక్కన పెట్టాలని కూడా ఆయన విన్నవించారు. కమిటీ తీర్పుల ఆధారంగా విచారణ కమిటీ తన విచారణను ముగించిందని, రుజువు భారాన్ని తప్పుగా తనపైకి మార్చిందని, కమిటీ నిజమని భావించిన వాస్తవాలను తాను తప్పని నిరూపించగలనని జస్టిస్ వర్మ పేర్కొన్నారు.
మరో రెండు మూడు రోజుల్లో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి, కేంద్రం వర్మపై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉన్న ఈ సమయంలో ఆయన పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం. ఇప్పటికే ఈ తీర్మానం కోసం ఎంపీల సంతకాలను సేకరించే ప్రక్రియ ప్రారంభించారు. లోక్‌సభలో తీర్మానాన్ని ప్రవేశపెడతామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు కూడా తెలిపారు.
అంతేకాకుండా, జస్టిస్ వర్మ నివాసం నుంచి పెద్ద మొత్తంలో లెక్కల్లో చూపని నగదును స్వాధీనం చేసుకోవడంపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, సమగ్రమైన దర్యాప్తు నిర్వహించాలని ఢిల్లీ పోలీసులు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ను ఆదేశించాలని కోరుతూ దాఖలైన తాజా పిటిషన్‌ను విచారించడానికి సుప్రీంకోర్టు అంగీకరించిన కొద్ది రోజులకే జస్టిస్ వర్మ ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఏమిటీ నోట్ల కట్టల వ్యవహారం
ఈ ఏడాది మార్చిలో ఢిల్లీలోని జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసం నుంచి అగ్నిప్రమాదం జరిగిందని తెలియడం, ఓ గదిలో పెద్ద మొత్తంలో పూరితా, కొంత పాక్షికంగా కాలిన నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇది పెద్ద వివాదం కావడంతో పాటు న్యాయవ్యవస్థలో అవినీతిపై తీవ్ర చర్చకు దారితీసింది. ఆ సమయంలో జస్టిస్ వర్మ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. ఈ వ్యవహారంతో అదే నెల 28న సుప్రీంకోర్టు కొలీజియం వర్మను అలహాబాదు కోర్టుకు బదిలీ చేసింది. ఆయనకు న్యాయపరమైన బాధ్యతలు ఇవ్వకుండా, ఘటనపై ముగ్గురు న్యాయమూర్తులతో దర్యాప్తు కమిటీని సుప్రీంకోర్టు నియమించింది.






