కొండపై నుంచి లోయలో పడిపోయిన జేసీబీ.. డ్రైవర్ మృతి(షాకింగ్ వీడియో)

by Jakkula.Mamatha |

రాష్ట్రంలో భారీ వర్షాలు భీబత్సం సృష్టిస్తున్నాయి.

కొండపై నుంచి లోయలో పడిపోయిన జేసీబీ.. డ్రైవర్ మృతి(షాకింగ్ వీడియో)
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో భారీ వర్షాలు భీబత్సం సృష్టిస్తున్నాయి. హిమాచల్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అనేక రహదారులను మూసివేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో హిమచల్‌ ప్రదేశ్‌లో భారీ వర్షాల కారణంగా వరదలతో పర్వత ప్రాంతాల్లోని రోడ్లన్నీ ప్రమాదకరంగా మారిపోయాయి. ఈ క్రమంలో శిమ్లా జిల్లాలోని జాబ్లీలో రోడ్డు పనులు చేస్తున్న ఓ జేసీబీ ప్రమాదానికి గురైంది. కొండపై నుంచి రాళ్లు పడడంతో ఒక్కసారిగా ఆ బుల్డోజర్‌ లోయలో పడిపోయింది. ఈ క్రమంలో దాదాపు 300 మీటర్ల లోతులో పడిపోయినట్లు అంచనా వేస్తున్నారు. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలవడంతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

ఇదిలా ఉంటే.. హిమచల్ ప్రదేశ్‌లో భారీ వరదలకు ట్రక్కులు, భారీ యంత్రాలు కొట్టుకుపోతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కుల్లు జిల్లాలో కురిసిన కుండపోత వర్షాలకు మలానా-1 జలవిద్యుత్ కేంద్రంలోని కాఫర్ డ్యామ్ తెగింది. దీంతో ఆనకట్ట సమీపంలో నిలిపి ఉంచిన డంపర్ ట్రక్కు, భారీ యంత్రాలు, క్యాంపర్ వంటి వాహనాలు వరదల్లో కొట్టుకుపోయాయి.

వీడియో

Next Story