ఎన్నికల్లో గెలిచేది మేమే.. జన్ సురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్ ధీమా

by Phanindra |

బిహార్ ఎన్నికల్లో తామే గెలుస్తామని జన్ సురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్డీయే, మహాఘట్‌బంధన్ ఆ తర్వాతి స్థానాలకే పరిమితం అవుతాయన్నరు.

ఎన్నికల్లో గెలిచేది మేమే.. జన్ సురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్ ధీమా
X

దిశ, నేషనల్ బ్యూరో: బిహార్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ జన్ సురాజ్ పార్టీ అధినేత, ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో తన పార్టీ అత్యధిక మెజార్టీ సాధిస్తుందని, లేదా చివరి స్థానంలో నిలుస్తుందని ఆయన అన్నారు. అధికార ఎన్డీయే కూటమిలోని జేడీ(యూ)కు 25 సీట్లకు మించి రావని తేల్చిచెప్పారు. బీజేపీకి కూడా ఓటమి తప్పదన్నారు. విపక్ష మహాఘట్‌బంధన్ మూడో స్థానంలో నిలుస్తుందని, తన పార్టీ పూర్తి ఆధిక్యం సాధిస్తుందని ధీమా వ్యక్తంచేశారు. తాము మొత్తం 243 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ‘మేం మొదటి స్థానంలో గెలుస్తాం. లేదా చివరి స్థానంలో మిగుల్తాం. ఎటూ కాకుండా మధ్యలో ఉండటం జరగదు’ అని పేర్కొన్నారు.

Next Story