ప్రధాని మోడీతో జమ్మూకశ్మీర్ CM ఒమర్ అబ్దుల్లా భేటీ.. ఉగ్రదాడి తర్వాత తొలిసారి

by Gantepaka Srikanth |

ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi)తో జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా(CM Omar Abdullah) భేటీ అయ్యారు.

ప్రధాని మోడీతో జమ్మూకశ్మీర్ CM ఒమర్ అబ్దుల్లా భేటీ.. ఉగ్రదాడి తర్వాత తొలిసారి
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi)తో జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా(CM Omar Abdullah) భేటీ అయ్యారు. పెహల్గాంలో ఉగ్రదాడి(Terror Attack) తర్వాత తొలిసారి వీరిద్దరు సమావేశం కావడం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడి, భద్రతా పరిస్థితులపై వీరు చర్చించినట్లు తెలుస్తోంది. మరోవైపు.. పెహల్గాం ఉగ్రదాడిపై ఎన్‌ఐఏ (National Investigation Agency) తన దర్యాప్తును పూర్తి చేసింది. మొత్తం 3 వేల మందిని విచారించి.. 90 మందిపై కేసులు నమోదు చేసింది. దాదాపు 100 ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు చేసింది. ఆదివారం కేంద్ర హోంశాఖకు ఎన్ఐఏ దర్యాప్తు నివేదికను సమర్పించబోతోంది.

ఈ నేపథ్యంలో ప్రధానితో జమ్మూ సీఎం భేటీ కావడం చర్చనీయాంశమైంది. మరోవైపు.. పెహల్గాం దాడి వెనుక పాకిస్తాన్‌కు చెందిన నిషేధిత ఉగ్రసంస్థ లష్కరే తోయిబా, పాక్‌ గూఢచార సంస్థ(Pakistani Intelligence Agency) ఐఎస్‌ఐ హస్తం ఉన్నట్లు NIA ప్రాథమిక నివేదికలో వెల్లడించింది. లష్కరే తోయిబా ఉగ్రవాదులే ఈ దాడికి పాల్పడినట్లు తెలిపింది. ఈ దాడికి పాకిస్తాన్‌లోని లష్కరే ప్రధాన కార్యాలయంలో ప్రణాళిక రచించినట్లు పేర్కొంది. ఈ దాడిలో ఉగ్రవాదులకు క్షేత్రస్థాయిలో దాదాపు 20 మంది సహకరించినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) గుర్తించింది. వీరిలో చాలామందిని ఇప్పటికే అరెస్టు చేసింది.

Next Story