- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Jaishankar: అప్పటి వరకు సింధూ జలాల ఒప్పందం రద్దు.. విదేశాంగ మంత్రి జైశంకర్
పాకిస్తాన్ సరిహద్దు ఉగ్రవాదాన్ని పూర్తిగా ఆపేసే వరకు సింధూ జలాల ఒప్పందం నిలిపివేస్తామని జైశంకర్ స్పష్టం చేశారు.

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్తాన్ (Pakisthan) సరిహద్దు ఉగ్రవాదాన్ని పూర్తిగా ఆపేసే వరకు సింధూ జలాల ఒప్పందం నిలిపివేస్తామని విదేశాంగ మంత్రి జైశంకర్ (Jai shaker) స్పష్టం చేశారు. పాకిస్థాన్‌తో చర్చించడానికి ఒకే విషయం మిగిలి ఉందని అది పాక్ ఆక్రమిత కశ్మీర్ (POK) అంశం మాత్రమేనని తెలిపారు. చట్టవిరుద్ధంగా ఆక్రమించబడిన భారత భూభాగాన్ని ఖాళీ చేయడంపైనే డిస్కషన్ ఉంటుందని ఈ విషయంలో చర్చకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్ (Operation sindhoor) పై స్పందిస్తూ.. కాల్పుల విరమణకు ఎవరు పిలుపునిచ్చారో స్పష్టంగా తెలుస్తుందన్నారు. ఉగ్ర స్థావరాలను నాశనం చేయాలని ఫిక్స్ చేసిన టార్గెట్ రీచ్ అయ్యామని, ఆపరేషన్ ప్రారంభంలోనే పాక్‌కు సందేశాన్ని పంపామన్నారు. పాక్ సైన్యంపై ఎక్కడ కూడా దాడులు చేయలేదని తెలిపారు.
ఆపరేషన్ సిందూర్ అనంతరం రిలీజైన శాటిలైట్ చిత్రాలను చూస్తే భారత్ ఎంత నష్టం చేసిందో అర్థమవుతుందన్నారు. మే7న దాడులు ప్రారంభమైతే దానిని అడ్డుకోవడానికి సాహసం చేయని వ్యక్తులు కాల్పుల విరమణ ప్రతిపాదించారని తెలిపారు. కశ్మీర్ విషయంలో మూడో పక్షం మధ్యవర్తిత్వం వహించడాన్ని భారత్ ఎప్పటికీ ఒప్పుకోబోదని తేల్చి చెప్పారు. భారత్, అమెరికా (India America) మధ్య వాణిజ్య చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. ఇది కొంచెం కష్టమైన విషయమని అంతా పూర్తయ్యే వరకు ఏమీ చెప్పలేమన్నారు. ట్రేడ్ డీల్ (Trade deal) ఇరు దేశాలకూ ప్రయోజనకరంగా ఉండాలని తెలిపారు.






