- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Jai shanker: యుద్ధాల వల్ల గ్లోబల్ సౌత్‌లో సంక్షోభం.. విదేశాంగ మంత్రి జైశంకర్
యుద్ధాల వల్ల గ్లోబల్ సౌత్‌లో ఇంధనం, ఆహారం, ఎరువుల భద్రతపై తీవ్ర ప్రభావం చూపుతుందని విదేశాంగ మంత్రి జైశంకర్ చెప్పారు.

దిశ, నేషనల్ బ్యూరో: రష్యా ఉక్రెయిన్, ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధాల వల్ల గ్లోబల్ సౌత్‌లో ఇంధనం, ఆహారం, ఎరువుల భద్రతపై తీవ్ర ప్రభావం చూపుతుందని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ (Jai shanker) నొక్కి చెప్పారు. సరఫరా గొలుసులు, లాజిస్టిక్స్ దెబ్బతిన్నాయని, అనేక దేశాలకు లభ్యతపై మాత్రమే కాకుండా ఖర్చుపై కూడా గణనీయమైన ప్రభావం పడిందని తెలిపారు. చర్చలు, దౌత్యం సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. శాంతి లేకుండా అభివృద్ధి సాధ్యం కాదని తెలిపారు. న్యూయార్క్‌లో జరిగిన జీ20 విదేశాంగ మంత్రుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. అంతర్జాతీయ పరిస్థితి రాజకీయంగా, ఆర్థికంగా అస్థిరంగా ఉందని తెలిపారు.
ఉగ్రవాదం అభివృద్ధికి అతిపెద్ద అడ్డంకిగా మారిందన్నారు. ఈ సమస్యపై ప్రపంచం రాజీపడకుండా ఉండటం ఎంతో అవసరమని వెల్లడించారు. సంఘర్షణలను మరింత క్లిష్టతరం చేయడం కంటే చర్చలు, దౌత్యం దిశగా వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. ఏదైనా సంఘర్షణ టైంలో ఇరుపక్షాలను కలుపుకునే సామర్థ్యం కొంతమందికి ఉంటుందని, అలాంటి దేశాలను అంతర్జాతీయ సమాజం ఉపయోగించుకుని శాంతి సాధనకు దోహదపడాలని పిలుపునిచ్చారు.






