- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Jagannath: జగన్నాథుడి రథానికి సుఖోయ్ జెట్ టైర్లు.. 20 ఏళ్ల తర్వాత మార్పు
కోల్‌కతా ఇస్కాన్ టెంపుల్‌లోని ప్రసిద్ధ లార్డ్ జగన్నాథ రథయాత్ర రథ చక్రాలు మార్చారు.

దిశ, నేషనల్ బ్యూరో: కోల్‌కతా ఇస్కాన్ (Iscon Kolkata) టెంపుల్‌లోని ప్రసిద్ధ లార్డ్ జగన్నాథ (Jagannath) రథయాత్ర రథ చక్రాలు మార్చారు. రష్యన్ సుఖోయ్ ఫైటర్ జెట్ (Sukhoy Fighterjet) టైర్లను రథంలో అమర్చారు. 20 ఏళ్ల తర్వాత ఈ టైర్లను అమర్చడం గమనార్హం. బోయింగ్ 747 జంబో జెట్ నుంచి తీసుకోబడిన పాత టైర్లను సుఖోయ్ యుద్ధ విమానాల్లో ఉపయోగించే ఎంఆర్ఎఫ్ తయారు చేసిన టైర్లతో భర్తీ చేశారు. గత కొన్నేళ్లుగా జగన్నాథ రథన్ని నడపడంలో ఇబ్బందులు ఉన్నాయని కోల్ కతా ఇస్కాన్ గుర్తించింది. టైర్లు అరిగిపోయాయని వాటిని మార్చాల్సిన అవసరం ఉందని 2005లోనే తెలిపారు. దీంతో అప్పటి నుంచి టైర్ల కోసం వెతుకుతోంది. ఈ క్రమంలోనే సుఖోయ్ జెట్ టైర్ల వ్యాసం బోయింగ్ టైర్ల మాదిరిగానే ఉండటంతో నిర్వాహకులు వాటిని రథంలో అమర్చాలని నిర్ణయించుకున్నారు. అంతకుముందు కూడా దీనికి ముందు కూడా జగన్నాథుని రథంలో బోయింగ్ బీ-747 విమానాలకు చెందినటైర్లను ఉపయోగించారు. కానీ ఈ విమానం ప్రస్తుతం వినియోగంలో లేదు కాబట్టి దాని టైర్లు దొరకడం కష్టంగా మారింది.






