Gaganyaan Mission: ఇస్రో ఐఏడీటీ-01 సక్సెస్.. గగన్ యాన్ మిషన్‌లో మరో ముందడుగు

by Prasad Jukanti |

భారతదేశం మొదటి మానవ సహిత అంతరిక్ష యాత్ర కోసం ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గగన్ యాన్ మిషన్‌లో మరో కీలక అడుగు ముందుకు పడింది.

Gaganyaan Mission: ఇస్రో ఐఏడీటీ-01 సక్సెస్.. గగన్ యాన్ మిషన్‌లో మరో ముందడుగు
X

దిశ, డైనమిక్ బ్యూరో: భారతదేశం మొదటి మానవ సహిత అంతరిక్ష యాత్ర కోసం ఇస్రో (ISRO) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గగన్ యాన్ మిషన్‌లో (Gaganyaan Mission) మరో కీలక అడుగు ముందుకు పడింది. వ్యోమగాములు అంతరిక్షం నుంచి భూమికి సురక్షితంగా తీసుకువచ్చే పారాచూట్ వ్యవస్థ పనితీరును పరీక్షించేదుకు చేపట్టిన 'ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ (IADT-01)ను విజయవంతంగా పూర్తి చేసినట్లు ఇస్రో ప్రకటించింది. ఇవాళ తెల్లవారుజామున శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి ఇస్రో, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, డీఆర్‌డీవో, ఇండియన్ నేవీ, ఇండియ కోస్ట్ గార్డ్ దళాలు ఉమ్మడిగా ఈ పరీక్షను నిర్వహించినట్లు ఇస్రో తన అధికారిక ఎక్స్‌లో పోస్టు చేసింది. అంతరిక్షం నుంచి భూమికి తిరిగి వచ్చే క్రమంలో వ్యోమగాములు ఉండే మాడ్యూల్ వేగాన్ని నియంత్రించి, దానిని సురక్షితంగా ల్యాండ్ చేసేలా ఈ పారాచూట్ వ్యవస్థ మొదటి నుంచి చివరి వరకు ఎలా పని చేస్తుందో సమగ్రంగా నిరూపించేందుకే తాజాగా ఈ ఐఏడీటీ-01 పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్ష విజయవంతం కావడంతో గగన్ యాన్ మిషన్ మరో కీలక మైలురాయి అధిగమించినట్లైంది.

Next Story