ఇరాన్‌పై ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్.. భారతీయులకు కేంద్రం అడ్వైజరీ జారీ

by Kema Shiva Kumar |   (  Updated:2025-06-13 03:34:24  IST  )

పశ్చిమాసియా (West Asia) మళ్లీ భీకర వాతావరణం నెలకొంది.

ఇరాన్‌పై ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్.. భారతీయులకు కేంద్రం అడ్వైజరీ జారీ
X

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమాసియా (West Asia) మళ్లీ భీకర వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే ఇరాన్‌ (Iran)పై ఇజ్రాయెల్‌ (Israel) ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ పేటిట ఎయిర్ స్ట్రైక్‌తో విరుచుకుపడుతోంది. ఇరాన్ అణు స్థావరాలే లక్ష్యంగా ఆ దేశ రాజధాని టెహ్రాన్‌ (Tehran)పై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటికే ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ చీఫ్ హుస్సేన్ సలామీ (Iran's Revolutionary Guard Chief Hossein Salami) దుర్మరణం పాలయ్యారు. అదేవిధంగా ఆ దేశ మిలటరీ చీఫ్ మహ్మద్ బగేరి (Mohammad Bagheri) కూడా ప్రాణాలు కోల్పోయనట్లుగా సోషల్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

అయితే, ఈ విషయాన్ని ఇప్పటి వరకు ఇరాన్ అధికారికంగా ధృవీకరించ లేదు. మరోవైపు ఇజ్రాయెల్‌పై ఇరాన్ ప్రతిదాడికి సిద్ధమవుతోన్న తరుణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరు దేశాల్లో నివసిస్తున్న భారత సంతతి పౌరులను ఉద్దేశించి కేంద్ర విదేశాంగ శాఖతో పాటు అక్కడి ఎంబసీలు (Indian Embassy) అడ్వైజరీలు జారీ చేశాయి. ఎవరూ అవనసర ప్రయాణాలు చేయొద్దని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లి తలదాచుకోవాలని సూచించాయి. స్థానిక అధికారులు చెప్పేంత వరకు అంతా భద్రతా దళాలు చెప్పిన విధంగా ఇండియన్ ఎంబసీ సోషల్ మీడియాను ఫాలో అవుతూ.. నడుకోవాలని తెలిపారు.

Next Story