Israel: గాజా నుంచి ఇజ్రాయెల్ దళాల ఉపసంహరణ.. సీజ్ ఫైర్ డీల్ ప్రకారం వెనక్కి

by B.Srinivas |

హమాస్‌తో కొనసాగుతున్న కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా ఉత్తర, దక్షిణ గాజాను వేరుచేసే నేత్రాజిమ్ కారిడార్ నుంచి ఇజ్రాయెల్ దళాలు ఆదివారం వెనక్కి వచ్చాయి.

Israel: గాజా నుంచి ఇజ్రాయెల్ దళాల ఉపసంహరణ.. సీజ్ ఫైర్ డీల్ ప్రకారం వెనక్కి
X

దిశ, నేషనల్ బ్యూరో: హమాస్‌తో కొనసాగుతున్న కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా ఉత్తర, దక్షిణ గాజాను వేరుచేసే నేత్రాజిమ్ కారిడార్ (Netrazim corridor) నుంచి ఇజ్రాయెల్ (Israel) దళాలు ఆదివారం వెనక్కి వచ్చాయి. ఇజ్రాయెల్ దళాలు తమ స్థానాలను, సైనిక పోస్టులను కూల్చివేసి, సలాహెద్దీన్ రోడ్డులోని నేత్రాజిమ్ కారిడార్ నుంచి తమ ట్యాంకులను పూర్తిగా ఉపసంహరించుకున్నాయి. హమాస్ ఆధ్వర్యంలోని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ దీనిని ధ్రువీకరించింది. అయితే ఎంత మంది సిబ్బందిని వెనక్కి తీసుకున్నారు అనే విషయం వెల్లడించలేదు. జనవరి 19న హమాస్‌తో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం.. ఇజ్రాయెల్ 6 కిలోమీటర్ల నేత్రాజిమ్ కారిడార్ నుంచి వైదొలగడానికి అంగీకరించింది. దీంతో తాజాగా వెనక్కి తగ్గడంతో ఆ ప్రాంతం గుండా పాలస్తీనియన్లు గాజాకు తిరిగి వస్తున్నారు. యుద్ధ సమయంలో ఇజ్రాయెల్ ఈ ప్రాంతాన్ని సైనిక కేంద్రంగా ఉపయోగించుకుంది. గాజా స్ట్రిప్‌లోని హమాస్ ఉగ్రవాదుల కదలికలను పర్యవేక్షించడానికి వాడుకుంది. ఉత్తర, దక్షిణ గాజా మధ్య పాలస్తీనియన్ల కదలికలను ఇజ్రాయెల్ నియంత్రిస్తుందని ఆరోపించడంతో ఈ కారిడార్ అత్యంత వివాదాస్పదమైంది.

Next Story