- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Israel: ట్రంప్ బెదిరింపులు.. వెనక్కి తగ్గిన ఇజ్రాయెల్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారీఫ్ లపై కీలక ప్రకటన చేయనున్నారు. కాగా.. ప్రతీకార సుంకాలపై ట్రంప్ హెచ్చరికలు జారీ చేయడంతో..ఇజ్రాయెల్ సంచలన నిర్ణయం తీసుకుంది.

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారీఫ్ లపై కీలక ప్రకటన చేయనున్నారు. కాగా.. ప్రతీకార సుంకాలపై ట్రంప్ హెచ్చరికలు జారీ చేయడంతో..ఇజ్రాయెల్ సంచలన నిర్ణయం తీసుకుంది. అగ్రరాజ్యం నుంచి తమ దేశానికి వచ్చే దిగుమతులపై అన్నిరకాల సుంకాలను (Tariffs) ఎత్తివేసింది. ఈమేరకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu) సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ప్రకటించారు. ‘‘ఇజ్రాయెల్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అయిన అమెరికా నుంచి దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై అన్నిరకాల కస్టమ్స్ సుంకాలను తక్షణమే రద్దు చేస్తున్నాం. మార్కెట్‌లో పోటీతత్వాన్ని ఆహ్వానించడం, ఆర్థిక వ్యవస్థలో వైవిధ్య విధానాలను అమలుచేయడం, జీవన వ్యయాన్ని తగ్గించడం కోసం గత కొన్ని దశాబ్దాలుగా మా ప్రభుత్వం కొన్ని పాలసీలు అనుసరిస్తుంది. కాగా.. సుంకాలు ఎత్తివేయడం మరో ముందడుగు లాంటిది. సుంకాల రద్దుతో ఇజ్రాయెల్ పౌరులకు, మా మార్కెట్‌కు ప్రయోజనం చేకూరడంతో పాటు ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం అవుతాయి. అమెరికాతో ప్రత్యేక అనుబంధాన్ని కొనసాగిస్తాం’’ అని నెతన్యాహు తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.
40 ఏళ్లుగా స్వేఛాయుత వాణిజ్యం
మరోవైపు, అమెరికా- ఇజ్రాయెల్ మధ్య 40 ఏళ్లుగా స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందం ఉంది. దీని కింద అమెరికా నుంచి దిగుమతి చేసుకునే 99 శాతం ఉత్పత్తులకు సుంకాల నుంచి మినహాయింపు కల్పించారు. గణాంకాల ప్రకారం.. 2024లో అమెరికాకు టెల్ అవీవ్ నుంచి 17.2 బిలియన్ డాలర్ల ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి. అదే సమయంలో అగ్రరాజ్యం నుంచి 9.2 బిలియన్ డాలర్ల వస్తువులను ఇజ్రాయెల్ దిగుమతి చేసుకుంది. ఇకపోతే, ఈ ప్రకటనపై చైనా మీడియా కీలక ప్రకటన చేసింది. ఈ సుంకాల రద్దును రాజకీయ కోణంలోనే చూడాలని, ఆర్థికంగా ఈ నిర్ణయంతో ఎలాంటి మార్పు ఉండదని అందులో పేర్కొంది. కేవలం వ్యవసాయ ఉత్పత్తులపైనే ఇజ్రాయెల్ అగ్రరాజ్యం నుంచి టారిఫ్‌లు వసూలు చేస్తున్నట్లు చైనా మీడియా తెలిపింది.






