- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Viral News: హోంవర్క్ చేయకపోతే ఇదే శిక్షా? బాలుడిపై ప్రిన్సిపాల్ దారుణం.. వైరల్
స్కూల్లో హోంవర్క్ చేయలేదని 7 ఏళ్ల విద్యార్థిని కిటికీకి వేలాడదీసి ఓ ప్రిన్సిపాల్ దారుణంగా కొట్టించింది.

దిశ, డైనమిక్ బ్యూరో: (Viral video) స్కూల్లో హోంవర్క్ చేయలేదని 7 ఏళ్ల విద్యార్థిని కిటికీకి వేలాడదీసి ఓ ప్రిన్సిపాల్ దారుణంగా కొట్టించింది. కొట్టిన వీడియోను కొద్దిరోజులకు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యార్థి పేరెంట్స్ ఫిర్యాదు ప్రకారం.. (Haryana) హర్యానా రాష్ట్రం చండీగఢ్‌లోని (Panipat) పానిపట్ పట్టణంలోని ఓ ప్రైవేటు స్కూల్‌లో ఏడేళ్ల బాలుడుని స్కూల్ బస్సు డ్రైవర్ శారీరక వేధింపులకు గురిచేశాడు. హోంవర్క్ చేయలేదని రెండో తరగతి విద్యార్థిని కిటికీకి తలకిందులుగా వేలాడదీసి ప్రిన్సిపాల్ డ్రైవర్‌తో కొట్టించింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. ఈ ఘటనపై విద్యార్థి పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదుతో.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
దీనితో పాటు ప్రిన్సిపాల్ రీనా ఆగడాలపై మరో వీడియో వైరల్ అయింది. హోంవర్క్ చేయకపోతే ఇదే శిక్షా అనే తీరులో అందులో బాలురను దారుణంగా చెంప దెబ్బలు కొట్టింది. ఆమెకు తెలియకుండా బాలురను కొట్టే సమయంలో ఓ వ్యక్తి రికార్డు చేసి ప్రిన్సిపాల్ ఆగడాలను బయటపెట్టారు. అయితే, విద్యార్థిని కిటికీకి తలకిందులుగా వేలాడదీసి ప్రిన్సిపాల్ రీనా ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి.. తప్పుడు కథలు అల్లేందుకు ప్రయత్నించింది. దురుసుగా ప్రవర్తించినందుకే ఇలా చేశానని, నేను కేవలం మందలించమన్నానని కానీ కొట్టిన విషయం నాకు తెలియదని ప్రిన్సిపాల్ రీనా బుకాయించింది. ఇక, వీడయోలు బయటకు రావడంతో ముందుగా పోలీసులు ప్రిన్సిపాల్‌ను, స్కూల్‌లో పలువురు సిబ్బందిని అరెస్ట్ చేశారు. ప్రిన్సిపాల్ రీనాపై స్కూల్ పిల్లల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లల చేత కొన్ని సార్లు బలవంతంగా టాయిలెట్‌లు శుభ్రం చేయించిందని తల్లిదండ్రులు ఆరోపించారు.






