ఢిల్లీ బ్లాస్ట్.. 3 గంటల ముందు Redditలో స్టూడెంట్ పోస్ట్

by Naga Rani Yarlagadda |

దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడు ఘటనలో 12 మంది మరణించారు.

ఢిల్లీ బ్లాస్ట్.. 3 గంటల ముందు Redditలో స్టూడెంట్ పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడు ఘటనలో 12 మంది మరణించారు. మరో 17 మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దారుణానికి పాల్పడిన వారెవరైనా సరే.. వదిలిపెట్టబోమని ప్రధాని నరేంద్రమోదీ తీవ్రంగా హెచ్చరించారు. కాగా.. పేలుడుకు 3 గంటల ముందు Redditలో ఓ విద్యార్థి చేసిన హెచ్చరిక ఇప్పుడు వైరల్ గా మారింది. బ్లాస్ట్ కు ముందు ఆ మెట్రో స్టేషన్ మీదుగా ప్రయాణించిన అతను.. ఎన్నడూ లేనంతగా భద్రతా దళాలను చూసినట్లు ఆ పోస్ట్ లో పేర్కొన్నాడు.

సదరు యూజర్ 12వ తరగతి చదువుతున్నానని తెలిపాడు. సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఢిల్లీలో ఏమైనా జరగబోతోందా ? అని పోస్ట్ పెట్టాడు. ఇప్పుడు తాను స్కూల్ నుంచి వచ్చానని, ఎర్రకోట, సమీప మెట్రో స్టేషన్ వద్ద ఎన్నడూ లేనంతగా పోలీసులు, ఆర్మీ సిబ్బంది, మీడియా కనిపించిందని పేర్కొన్నాడు. మెట్రోలో ప్రయాణం చేసేటపుడు కూడా తాను ఇంతమంది సైన్యాన్ని ఎప్పుడూ చూడలేదని, అసలు అక్కడ ఏం జరుగుతోంది? అని పోస్ట్ లో ప్రశ్నించాడు.

ఈ పోస్ట్ పెట్టిన 3 గంటల తర్వాత అదే ప్రాంతంలో హ్యుందాయ్ ఐ20 కారు పేలగా.. 10 వాహనాలు దగ్ధమయ్యాయి. దాంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. పేలుడు సంభవించిన ప్రదేశం, సమయం విషయంలో అతను అంత కచ్చితంగా అనుమానం వ్యక్తం చేయడంపై నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. తెలియకుండానే ఆ విద్యార్థి ఢిల్లీ పైరుల్ని హెచ్చరించేందుకు ప్రయత్నించాడంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story