అమెరికాను చెంపదెబ్బ కొట్టాం: ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ

by Ajay Maddhiboyina |

ఇరాన్ ఇజ్రాయెల్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఒప్పందం తరవాత ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ కనిపించకుండా పోయారు.

అమెరికాను చెంపదెబ్బ కొట్టాం: ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ
X

దిశ, వెబ్ డెస్క్: ఇరాన్ ఇజ్రాయెల్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఒప్పందం తరవాత ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ కనిపించకుండా పోయారు. సోషల్ మీడియాలో యుద్ధం సమయంలో వరుస పోస్టులు పెట్టిన ఆయన ఎక్కడకు వెళ్లిపోయారనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే తాజాగా ఆయన కాల్పుల విరమణ తరవాత మొదటిసారి స్పందించారు. 12 రోజుల పాటు జరిగిన యుద్ధంలో ఇజ్రాయెల్‌పై తమ దేశమే విజయం సాధించిందని అన్నారు.

అమెరికా స్థావరాలపై దాడి చేయడం ద్వారా ఆ దేశానికి చెంపపెట్టు లాంటి సమాధానం ఇచ్చామని పేర్కొన్నారు. ఈ యుద్ధం వల్ల అమెరికా ఎలాంటి ప్రయోజనం పొందలేకపోయిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధంలో అమెరికా సైతం ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇరాన్‌లోని అణుస్థావరాలపై అమెరికా దాడి చేసింది. దీనికి ప్రతీకారంగా ఖతార్‌, ఇరాక్‌, కువైట్‌, బహ్రెయిన్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు చేసింది.

Next Story